Black Grapes : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు ఒకటి. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఇవి దాదాపు అన్ని కాలాల్లో మనకు విరివిరిగా లభ్యమవుతూ ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ద్రాక్ష పండ్లల్లో కూడా ఆకపచ్చ ద్రాక్ష పండ్లు, నల్ల ద్రాక్ష పండ్లు అనే రెండు రకాలు ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల కంటే నల్ల ద్రాక్ష పండ్లు మన శరీరానికి మరింత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో ద్రాక్ష పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ద్రాక్ష పండ్ల వల్ల మనకు మేలు కలిగినప్పటికి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని ఖాళీ కడుపున అస్సలు తీసుకోకూడదని వారు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. మనకు తెలియకుండానే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి.
దీంతో మనం బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇవి శరీరంపై, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అలాగే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే జీర్ణక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా ద్రాక్ష పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే వీటిలో సహజ సిద్ద చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. కనుక వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే ద్రాక్ష పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ అలర్జీలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ద్రాక్ష పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కనుక వీటిని ఖాళీ కడుపున తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడంతో పాటు కడుపులో నొప్పి, కడుపులో చికాకు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందాలంటే వీటిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.