Chiranjeevi : త‌న విజ‌యాల వెనుక ఉన్న‌ది ఎవ‌రో చెప్పేసిన చిరంజీవి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈయ‌న పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. మెగాస్టార్‌గా ఈయ‌న ఖ్యాతి దేశ‌దేశాల‌కు వ్యాప్తి చెందింది. ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న చిరంజీవి సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నిమ‌గ్న‌మ‌వుతుంటారు. ఇప్ప‌టికే ఆయ‌న బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మందికి పున‌ర్జ‌న్మ ఇచ్చారు. ఇంకా ఎంతో మందికి ఆయ‌న స‌హాయం చేస్తూనే ఉన్నారు. అలాగే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నానంటూ ఆదుకుంటున్నారు.

Chiranjeevi told who is behind his success
Chiranjeevi

అయితే చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయ్యారో.. ఎంత‌టి కీర్తి, ప్ర‌తిష్ట‌లు సాధించారో అంద‌రికీ తెలుసు. మ‌రి ఆయ‌న ఇన్ని విజ‌యాల‌ను సాధించ‌డం వెనుక ఎవ‌రు ఉన్నారో తెలుసా ? ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

త‌న విజ‌యాల‌న్నింటి వెనుక ఉంది త‌న భార్య సురేఖ‌నే అని చిరంజీవి చెప్పారు. ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఒక మ‌హిళ క‌చ్చితంగా ఉంటుంద‌ని.. త‌న వెనుక త‌న భార్య ఉంద‌ని.. ఆమె అండ‌గా నిల‌వ‌డంతోనే తాను ధైర్యంగా సినిమాలు చేశాన‌ని.. ఈ రోజు తాను ఇంత‌టి స్టార్‌ను అయ్యానంటే అందుకు కార‌ణం సురేఖ‌నే అని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వహించారు.

ఇక ఏపీలో నెల‌కొన్న సినీ రంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోనూ మెగాస్టార్ కీల‌క‌పాత్ర పోషించారు. ఏపీలో కొత్త రేట్ల ప్ర‌కారం సినిమా టిక్కెట్ల‌ను ఇవ్వ‌నున్నారు. రేట్లు పెరిగేందుకు కార‌ణ‌మైన చిరంజీవిని, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చూపిన చొర‌వ‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే చిరంజీవి త్వ‌ర‌లోనే ఆచార్య‌గా మ‌న ముందుకు రానున్నారు. దీంతోపాటు బోళా శంక‌ర్‌, గాడ్ ఫాద‌ర్ అనే సినిమాల్లోనూ ఈయ‌న న‌టిస్తున్నారు. ఇవి షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

Editor

Recent Posts