Coconut Rava Laddu : కొబ్బ‌రి, ర‌వ్వ‌తో ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Coconut Rava Laddu : ల‌డ్డూ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.. బూదీతో త‌యారు చేసిన ల‌డ్డూలు. వీటిని ఆల‌యాల్లో ప్ర‌సాదంగా కూడా ఇస్తుంటారు. అయితే ల‌డ్డూల‌ను ప‌లు ఇత‌ర ప‌దార్థాల‌తోనూ త‌యారు చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా ర‌వ్వ‌, కొబ్బ‌రితో త‌యారు చేసే ల‌డ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో పండుగ‌ల స‌మ‌యంలో త‌యారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి రవ్వ – 2 కప్పులు, ఎండుకొబ్బరి పొడి – 1 కప్పు, యాలకులపొడి – అర టేబుల్‌ స్పూన్‌, పాలు – అర కప్పు, నెయ్యి – 3 స్పూన్లు, చక్కెర – ఒకటిన్నర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, ఎండుద్రాక్ష – పావు కప్పు.

Coconut Rava Laddu recipe in telugu tasty how to make them
Coconut Rava Laddu

కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూలను తయారు చేసే విధానం..

బొంబాయి రవ్వను పాన్‌లో వేసి స్పూన్‌ నెయ్యిని చేర్చి దోరగా వేయించాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. ఈ రవ్వ మిశ్రమంలో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలుపాలి. రవ్వ కొంచెం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి బాగా క‌లుపుతూ ల‌డ్డూల‌లా త‌యారు చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూలు రెడీ అవుతాయి. వీటిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.

Editor