Dal Tadka : ధాబాల‌లో ల‌భించే దాల్ తడ్కాను.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Dal Tadka : మ‌నం కందిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. కందిపప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ప‌ప్పు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 3, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్.

Dal Tadka recipe in telugu very tasty how to make it
Dal Tadka

దాల్ త‌డ్కా త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు, ప‌సుపు, ఒక టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టాలి. దీనిని మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం మ‌రియు వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, కొత్తిమీర‌, క‌రివేపాకు వేసి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా ఉడికించిన ప‌ప్పు, ఒక గ్లాస్ నీళ్లు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌ప్పును మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి.

నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత కారం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కా త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కందిప‌ప్పుతో ఎప్పుడూ చేసే వంట‌ల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా దాల్ త‌డ్కాను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts