సాధారణంగా హిందూ ఆచారాల ప్రకారం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా ప్రతి రోజూ దీపారాధన చేసి ఆ దేవుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే దీపారాధన కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెను, వత్తులను ఉపయోగిస్తుంటారు. చాలామంది దూదితో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దీపారాధనకు అరటి నార వత్తులను వాడితే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
ఈ విధంగా అరటినారతో తయారుచేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా తామర కాడలతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా మందికి పెళ్లయి సంవత్సరాలు గడిచినా సంతానం లేకపోవడం వల్ల ఎన్నో పూజలు, నోములు చేస్తుంటారు.
ఈ విధంగా సంతానం లేని వారు ప్రతిరోజు అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. చాలామందికి దుష్టశక్తుల పీడ ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి పొందడం కోసం జిల్లేడు వత్తులతో గణపతికి పూజ చేయటం వల్ల దుష్టశక్తుల పీడ తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.