Dhaba Style Chicken Curry : ధాబా స్టైల్‌లో చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Chicken Curry : చికెన్ క‌ర్రీని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ధాబా స్టైల్ లో త‌యారు చేసే ఈ చికెన్ ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ చికెన్ ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన జీడిప‌ప్పు – 8, నాన‌బెట్టిన ఎండుకొబ్బ‌రి – ఒక ఇంచు ముక్క‌, నాన‌బెట్టిన గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ఉప్పు- త‌గినంత‌, చికెన్ – అర‌కిలో, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dhaba Style Chicken Curry recipe very tasty with roti
Dhaba Style Chicken Curry

ధాబా స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో జీడిప‌ప్పు, ఎండుకొబ్బ‌రి, గ‌స‌గ‌సాలు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో ట‌మాటాలు కూడా వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా, మిరియాల పొడి, మిక్సీ ప‌ట్టుకున్న జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా చికెన్ క‌ర్రీని ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts