Belly Fat : నేటి తరుణంలో మనలో చాలా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. షుగర్, బీపీ, గుండె జబ్బులు వంటి వాటితో పాటు మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణం మారిన మన ఆహారపు అలవాట్లు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పంచదార కలిగిన తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే పొడులను వాడుతూ ఉంటారు. అలాగే అనేక రకాల చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటారు.
వీటికి బదులుగా మన ఆహారపు అలవాట్లలోనే మార్పులు చేసుకోవడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. అలాగే శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోవాలంటే మనం మన ఆహారపు అలవాట్లల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట దగ్గర ఎక్కువ ఎక్కువగా ఉన్న వారు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, ఫైబర్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది.
కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది. అలాగే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పండ్లల్లో ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం ఇతర చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా ఉంటాము. పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు 12 శాతం తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్న వారు మద్యాన్ని తీసుకోవడం తగ్గించాలి. ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల శరీరంలోకి అదనంగా ఎన్నో క్యాలరీల శక్తి వచ్చి చేరుతుంది. అదనంగా ఉన్న క్యాలరీలు పొట్ట దగ్గర కొవ్వుగా పేరుకుపోతూ ఉంటాయి.
కనుక మద్యాన్ని తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించడంలో వల్ల శరీర బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇక పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్న వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ కూడా మన శరీరానికి ఎంతో అవసరం. ప్రోటీన్ ఎక్కువగాఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిని భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని శరీర బరువు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.