తమిళ స్టార్ నటుడు ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు జనవరి 17వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. వీరు తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని ఒక ప్రకటనలో కోరారు. దీంతో వీరి విడాకుల విషయం సంచలనంగా మారింది. 18 ఏళ్ల వివాహ బంధానికి వీరు స్వస్తి పలికారు. అయితే వీరిద్దరినీ కలిపేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. వీరు విడిపోవాలనే నిర్ణయించారు. అయితే ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేస్తే ముందుగా కోర్టు ఇద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వీరి విషయంలో అది కూడా జరగడం లేదని తెలుస్తోంది.
విడాకులకు దరఖాస్తు చేసే జంటలకు కోర్టు చివరి అవకాశం కల్పిస్తుంది. కానీ వీరు మాత్రం ఆ అవకాశం కూడా వద్దనుకున్నారట. ఇద్దరికీ సయోధ్య కుదిర్చేందుకు కోర్టు యత్నించగా.. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఎట్టి పరిస్థితిలోనూ కలిసి ఉండే ప్రసక్తే లేదని ఇద్దరూ చెప్పారట. దీంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసేందుకు ఫార్మాలిటీస్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక వీరికి ఇద్దరు కుమారులు కాగా.. వారు తమ తల్లి ఐశ్వర్య రజనీకాంత్ వద్దే ఉండేందుకు అంగీకరించారు. దీంతో వారు ఆమె దగ్గరే పెరగనున్నారు.
ఇక ఇద్దరూ విడాకులు తీసుకుంటున్న విషయం ఫిక్స్ అయింది. వీరు కలసి ఉండబోరనే విషయం కన్‌ఫామ్ అయింది. దీంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరు కొంతకాలం ఎడబాటు అనంతరం కలసి పోతారని భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఫ్యాన్స్ విచారంలో ఉన్నారు. ఇక ఐశ్వర్య డైరెక్టర్‌గా కొనసాగేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తమిళ స్టార్ నటుడు శింబుతో కలిసి ఓ సినిమా చేయనుందని తెలుస్తోంది. శింబు ఈ మధ్యే మానాడు సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో అతనితో ఆమె ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.