vastu

Chanakya Niti : ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్ర‌దేశాల్లో అస‌లు ఇంటిని నిర్మించ‌రాదు.. లేదంటే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

Chanakya Niti : సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాగే ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను పాటిస్తారు. వాస్తు, శుభ ముహుర్తాలు, పూజ‌లు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు. ఇలా ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆ కుటుంబంలోని వారు సుఖ శాంతుల‌తో జీవిస్తారు. కుటుంబం అభివృద్ది చెందుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటారు. కానీ కొంద‌రు ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటారు. మ‌నం తెలిసి తెలియ‌క చేసే ఈ త‌ప్పులే మ‌న జీవితాన్ని నాశ‌నం చేస్తాయి. మ‌నం చేసే త‌ప్పులే మ‌నం ఆర్థికంగా న‌ష్టాల‌కు గురి అయ్యేలా చేస్తాయి. అయితే ఆచార్య చాణ‌క్యుడు కూడా ఇంటి నిర్మాణం గురించి కొన్ని చిట్కాలను అందించాడు. ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం ప్ర‌కారం 5 ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌దు మ‌రియు ఆ ప్ర‌దేశాల్లో నివ‌సించ‌కూడ‌దు.

ఈ ప్ర‌దేశాల్లో నివ‌సించ‌డం వ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు రావ‌డంతో పాటు ప్రాణాల‌కు కూడా ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు. ఆచార్య చాణ‌క్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఇల్లు క‌ట్టుకోకూడ‌ని ప్ర‌దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప‌గలు మ‌రియు రాత్రి స‌మ‌స్య‌ల‌తో చుట్టుముట్ట‌బ‌డిన ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల జీవితంలో ఒకదాని త‌ర్వాత ఒక‌టి స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఉపాధి మార్గాలు లేని చోట‌, జీవ‌నోపాధి లేని చోట కూడా ఇల్లు క‌ట్టుకోకూడ‌దు. అటువంటి ప్ర‌దేశాల్లో నివ‌సించ‌కూడ‌దని చాణ‌క్యుడు చెప్పారు. ఇలాంటి ప్రదేశాల్లో నివ‌సించ‌డం వ‌ల్ల కొంత‌కాలానికి ధ‌న‌వంతుడు కూడా పేద‌వాడు అవుతాడు. ప‌ని బాగా చేసుకోగ‌లిగే చోట‌, కుటుంబాన్ని బాగా పోషించ‌గ‌లిగే చోట మాత్ర‌మే నివాసం ఉండాలి. అలాగే శ్మ‌శాన వాటిక ద‌గ్గ‌ర లేదా పూర్తిగా ఏకాంతంగా ఉన్న చోట ఇంటిని నిర్మించ‌కూడ‌దు. ఇటువంటి ప్ర‌దేశాల్లో ప్ర‌తికూల శ‌క్తులు ఎక్కువ‌గా ఉంటాయి.

do not build home in these places

అలాగే ఇంట్లో ఉండే వ్య‌క్తుల భ‌ద్ర‌త ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఇక మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే వారు, త‌ప్పుడు ప‌నులు చేసే వారు ఉన్న చోట కూడా నివాసం ఉండ‌కూడ‌దు. అలాగే ఆచార్య చాణ‌క్యుడి ప్ర‌కారం న్యాయ వ్య‌వ‌స్థ స‌రిగ్గా లేని చోట‌, నిబంధ‌న‌లు పాటించ‌ని చోట‌, ఆరోగ్య సౌక‌ర్యం లేని చోట కూడా నివాసం ఉండ‌కూడ‌దు. ఇటువంటి ప్ర‌దేశాల్లో ఉండ‌డం వల్ల కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త ఎల్ల‌ప్పుడూ ప్ర‌మాదంలో ఉంటుంది. అలాగే ఎప్పుడూ భ‌యం, భ‌యాందోళ‌న‌ల‌తో కూడిన వాతావ‌ర‌ణం ఉన్న చోట కూడా ఇల్లు క‌ట్టుకోకూడదు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం జీవితాంతం భ‌యంతో బ్ర‌త‌కాల్సి వ‌స్తుంది. ఈ విధంగా ఈ 5 ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌ద‌ని ఆచార్య చాణ‌క్యుడు నీతి శాస్త్రంలో తెలియ‌జేసాడు.

Admin

Recent Posts