home gardening

Balcony Plants : మీ బాల్క‌నీ ఏ దిక్కు ఉంది.. దాన్ని బ‌ట్టి మొక్క‌ల‌ను ఇలా పెంచుకోండి..!

Balcony Plants : ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా కాంక్రీట్ జంగిల్‌లా మారింది. చూద్దామంటే మ‌చ్చుకు ఒక చెట్టు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రోజంతా ప‌నిచేసే వాళ్ల‌కు ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో సేద‌దీరుదామంటే అది అంద‌ని ద్రాక్షే అయింది. దీంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చాలా మంది మొక్క‌లు పెంచేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ క‌నుక ప్ర‌జ‌లు త‌మ బాల్క‌నీలో వివిధ ర‌కాల మొక్క‌ల‌ను పెట్టుకునేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. అయితే బాల్క‌నీ ఏ దిక్కున ఉంటే ఏయే మొక్క‌ల‌ను ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ బాల్క‌నీ తూర్పు దిశ‌లో ఉంటే తుల‌సి, బంతి పువ్వుల మొక్క‌ల‌ను పెట్టాలి. ఇలా చేస్తే మీతోపాటు మీ పిల్ల‌ల కెరీర్‌పై అది సానుకూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఈ మొక్క‌ల‌ను బాల్క‌నీలో ఈశాన్య దిశ‌లో పెట్టాలి. ఇక మీ ఇంటి బాల్కనీ ఉత్త‌ర దిశ‌లో ఉంటే అక్కడ మ‌నీ ప్లాంట్ లేదా క్రాసులా ప్లాంట్‌ను పెంచితే మంచిది. అదే బాల్క‌నీ ప‌శ్చిమ దిశ‌లో ఉంటే అక్క‌డ 2-4 అడుగుల ఎత్తు ఉన్న మొక్క‌ల‌ను పెంచాలి. పెద్ద మొక్క‌ల‌ను పెంచితే శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం ప‌డుతుంది.

how is your balcony grow plants like this

మీ ఇంటి బాల్క‌నీ ద‌క్షిణ దిశ‌లో ఉంటే అక్క‌డ పెద్దవైన‌, భారీ మొక్క‌ల‌ను ఉంచితే మంచి జ‌రుగుతుంది. బౌగెన్‌విల్లా, బ్లాక్ ఫిక‌స్‌, పామ్ ట్రీ వంటి కొన్ని మొక్క‌ల‌ను పెట్ట‌వ‌చ్చు. ఇవి మీ బాల్క‌నీని అందంగా మారుస్తాయి. వాస్తు దోషాలు క‌ల‌గ‌కుండా చేస్తాయి. ఇక కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను అస‌లు బాల్క‌నీలో పెట్ట‌కూడ‌దు. కాక్ట‌స్ లేదా ర‌బ్బ‌ర్ మొక్క‌ల‌ను బాల్క‌నీలో పెట్ట‌కూడ‌దు. బాల్క‌నీలో ఉంచిన మొక్క‌లు ఎండిపోతే వెంటనే తొల‌గించి వేరే మొక్క‌ల‌ను పెట్టాలి.

Admin

Recent Posts