సాధారణంగా మనం తరచూ మన ఇంట్లోకి కావల్సిన లేదా మనకు వ్యక్తిగతంగా అవసరం అయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. అయితే జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాల ప్రకారం.. కొన్ని వస్తువులను కొన్ని రోజుల్లోనే కొనాలి. ఇక కొన్ని వస్తువులను కొన్ని రోజుల్లో కొనరాదు. వేటిని ఏయే రోజుల్లో కొనుగోలు చేయరాదో.. ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారాల్లో ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాల్లో నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శనివారం రోజు నూనెను కొనుగోలు చేయడం కూడా మానుకోవాలి.
అయితే శనివారం రోజు నూనెను దానంగా ఇవ్వవచ్చు. దీంతో పుణ్యం లభిస్తుంది. శనివారం ఆవాలను కొనరాదు. ఉప్పు మన నిత్య జీవితంలో భాగం. కానీ దాన్ని శనివారం రోజు కొనుగోలు చేయరాదు. శనివారం ఉప్పును కొనుగోలు చేస్తే అప్పుల బాధలు పెరిగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
శనివారం రోజు కత్తెరను కూడా కొనుగోలు చేయరాదు. దాన్ని కొంటే ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయట. అదేవిధంగా నలుపు రంగులో ఉండే బూట్లు, నలుపు దుస్తులను కొనరాదు. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. ఇక శనివారం నాడు ఇంధనాన్ని కొనుగోలు చేయడం నిషిద్ధమని అంటున్నారు. శనివారం ఇంధనాన్ని ఇంటికి తీసుకువస్తే అది కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తుందట.
ఇక శనివారం చీపురును కొనరాదు. పిండి పట్టించి ఇంటికి తేరాదు. ఆదివారం పిండి పట్టించి ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా నియమాలను పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.