Pooja Room : పూజ గ‌దిలో వీటిని ఉంచితే అరిష్టం.. ఇబ్బందుల్లో ప‌డిపోతారు..!

Pooja Room : మ‌న ఇండ్ల‌ల్లో పూజ చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా పూజ గ‌దులు ఉంటాయి. మ‌న‌కు స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని మ‌నం భ‌గ‌వంతున్ని పూజిస్తూ ఉంటాం. కానీ పూజ గ‌దిలో వాస్తు శాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. పూజ గ‌దిలో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల మ‌నకు ద‌రిద్రం చుట్టుకుని అప్పులు, క‌ష్టాల బారిన ప‌డ‌తామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. భ‌గ‌వంతుని చ‌ల్ల‌ని చూపు మ‌న‌పై ఉండాల‌ని మ‌నం పూజ‌లు చేస్తాం. కానీ పూజ గ‌దిలో ఈ వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల భ‌గ‌వంతుని చ‌ల్ల‌ని చూపు మ‌న‌పై ఉండ‌కుండా పోతుంది. అస‌లు పూజ గ‌దిలో ఉంచ‌కూడ‌ని వ‌స్తువులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తి రోజూ పూజ గ‌దిని శుభ్రం చేసిన త‌రువాతే భ‌గ‌వంతున్ని పూజించి ధూప‌, దీప నైవేద్యాల‌ను స‌మ‌ర్పించాలి.అలాగే మ‌న పూజ గ‌దిలో విరిగిపోయిన విగ్ర‌హాలు ఉంటే వెంట‌నే తొల‌గించాలి. అలాగే విరిగిపోయిన, చిరిగిపోయిన ఫోటోల‌ను, ప్ర‌తిమ‌ల‌ను మ‌నం పూజ గ‌దిలో ఉంచ‌కూడ‌దు. అలా ప‌గిలిపోయిన వాటిని వెంట‌నే పారే నీటిలో వేయాలి. అదే విధంగా మ‌న ఇంట్లో క‌నుక శివ‌లింగం ఉంటే ప్ర‌తిరోజూ పూజ చేయాలి. ఇలా ప్ర‌తి రోజూ పూజ చేయ‌డం కుద‌ర‌క‌పోతే శివ‌లింగాన్ని ఇంట్లో ఉంచుకోక‌పోవ‌డ‌మే మంచిదని పండితులు చెబుతున్నారు.

do not put these things in Pooja Room
Pooja Room

అదే విధంగా ఒక దేవుడికి చెందిన మూడు ప్ర‌తిమ‌ల‌ను మ‌నం పూజ గ‌దిలో ఉంచుకోకూడ‌దు. అలాగే మ‌న ఇంట్లో ఎండిపోయిన తుల‌సి మొక్క‌ను ఉంచుకోకూడ‌దు. తుల‌సి మొక్క ఎండిపోతే ఆ మొక్క‌ను వెంట‌నే తొల‌గించి ప్ర‌వ‌హిస్తున్న నీటిలో వేయాలి. మ‌న ఇంట్లో ఉన్న తుల‌సి మొక్క‌కు ప్ర‌తి రోజూ పూజ చేయ‌డం చాలా మంచిది. అలా వీలు కానీ ప‌క్షంలో ప్ర‌తి శుక్ర‌వారమైనా పూజ చేయాలి. అలాగే ఇద్ద‌రు భార్య‌లు ఉన్న వినాయ‌కుడి ఫోటోను కానీ, ప్ర‌తిమ‌ను కానీ పూజ గ‌దిలో ఎప్పుడూ పెట్టుకోకూడ‌దు. అలాగే వినాయ‌కుడిని తుల‌సీ దళంతో పూజించ‌రాదు. అదే విధంగా ప్ర‌తి ఇంట్లో సీతారాముల ఫోటో, పార్వ‌తి ప‌ర‌మేశ్వ‌రుల ఫోటో, ల‌క్ష్మీ నారాయ‌ణుల ఫోటో త‌ప్ప‌కుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోటోల‌ను పూజ గ‌దిలో ఉంచుకోవ‌డం వ‌ల్ల భార్యా భ‌ర్తలు అన్యోన్యంగా ఉంటారు.

అదే విధంగా న‌ర దిష్టి మ‌న ఇంటి వైపు రాకుండా ఉండ‌డానికి మ‌న పూజ గ‌దిలో ఆంజ‌నేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. అలాగే మ‌న పూజ గ‌దిలో లక్ష్మీ దేవి నిల‌బ‌డి ఉన్న ఫోటోను కానీ, ల‌క్ష్మీ దేవి గుడ్ల‌గూబ నిల‌బ‌డి ఉన్న ఫోటోను కానీ పెట్టుకోకూడ‌దు. ల‌క్ష్మీదేవి ప‌క్క‌న‌ రెండు ఏనుగులు ఉన్న ఫోటోను మాత్ర‌మే పూజ గ‌దిలో ఉంచుకోవాలి. ఈ ఫోటోకు ప్ర‌తి శుక్ర‌వారం కుంకుమార్చ‌న చేయాలి. మ‌న పూజ గ‌దిలో కేవ‌లం శ్రీ‌రామ ప‌ట్టాభికేషం ఫోటోను మాత్ర‌మే పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌క‌ల దేవ‌త‌ల అనుగ్ర‌హాన్ని మ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే మ‌న పూజ గ‌దిలో శాంత స్వ‌రూపంలో ఉన్న ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఫోటోను ఉంచుకోవాలి.

ఇంట్లో ప‌గిలిన గాజు వ‌స్తువుల‌ను కూడా ఉంచుకోకూడ‌దు. శివుడి ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే త‌ప్ప‌కుండా బిల్వ ప‌త్రాల‌తో పూజ చేయాలి. అలాగే శివుడికి వెల‌గ పండు స‌మ‌ర్పిస్తే చాలా మంచిది. ఇలా స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల మ‌న‌కు దీర్ఘాయుష్షు క‌లుగుతుంది. అదే విధంగా శివుడికి సంపంగి పువ్వును, తుల‌సీ ద‌ళాల‌ను స‌మ‌ర్పించ‌కూడ‌దు. ఎప్పుడు కూడా గ‌డ‌ప ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలా ముగ్గు వేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి ఇంట్లోకి వ‌స్తుంది. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న‌కు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Share
D

Recent Posts