ఆధ్యాత్మికం

Lord Ganesha : గ‌ణ‌ప‌తిని ఇలా పూజించండి.. మీరు చేసే ప‌నుల్లో అస‌లు అడ్డంకులే రావు..!

Lord Ganesha : హిందూ ఆచారాల ప్ర‌కారం శుభ కార్యాలు చేసేట‌ప్పుడు ముందుగా గ‌ణ‌ప‌తిని పూజిస్తూ ఉంటారు. గ‌ణ‌ప‌తి పేరుతో శుభ కార్యాలు ప్రారంభిస్తే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌రుగుతాయ‌ని న‌మ్ముతారు. హిందూ ధ‌ర్మాల ప్రకారం బుధ‌వారం గ‌ణ‌ప‌తికి అంకితం చేయ‌బ‌డింది. బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తిని పూజిస్తే అనేక శుభాలు క‌లుగుతాయని విశ్వ‌సిస్తారు. అలాగే బుధ‌వారం పూజ చేసే స‌మ‌యంలో గ‌ణ‌ప‌తికి శాస్త్రోక్తంగా గ‌రికెను స‌మ‌ర్పిస్తే భ‌క్తుల క‌ష్టాలు త్వ‌ర‌గా తీరుతాయ‌ని గ‌ణేశుడి కృప ఎల్లప్పుడూ మ‌న‌పై ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. జోతిష్య శాస్త్రం ప్ర‌కారం బుధ‌వారం గ‌ణేశుడుకి పూజ చేసే స‌మ‌యంలో గ‌రికెను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల భ‌క్తుల కోరికెలు తీర‌డంతో పాటు ఐశ్వ‌ర్యం కూడా పెరుగుతుందని న‌మ్ముతారు.

కానీ చాలా మందికి గ‌ణ‌ప‌తికి గ‌రికెను స‌మ‌ర్పించే స‌రైన విధానం తెలియ‌దు. దీంతో మ‌నం చేసే చిన్న పొర‌పాటు కూడా గ‌ణ‌ప‌తికి ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తాయి. క‌నుక గ‌ణ‌ప‌తికి గ‌రికెను స‌మ‌ర్పించే స‌రైన విధానాన్ని అంద‌రూ తెలుసుకోవ‌డం ముఖ్యం. గ‌ణ‌ప‌తికి గ‌రికెను స‌మర్పించే స‌రైన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ణేశుడికి స‌మ‌ర్పించే గ‌రికె మెత్త‌గా ఉండాలి. ఈ ర‌క‌మైన గ‌రికెను బాల‌త్రిణం అంటారు. ఇది ఎండిన‌ప్పుడు గ‌డ్డిలాగా క‌నిపిస్తుంది. అలాగే గ‌ణ‌ప‌తికి 3, 5 లేదా 7 మొద‌లైన బేసి సంఖ్య‌లో గ‌రికెను స‌మ‌ర్పించాలి. అలాగే వినాయ‌కుడికి మందార పువ్వులంటే కూడా చాలా ప్రీతి. క‌నుక పూజ స‌మ‌యంలో మందార పువ్వుల‌ను కూడా గ‌ణేశుడికి స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఈ విధంగా గ‌ణ‌ప‌తికి గ‌రికెను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల గ‌ణేశుడి కృప ఎల్ల‌పుడూ మ‌న‌పై ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.

do pooja to lord ganesha like this you will never face any problem

మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఆటంకాలు తొల‌గిపోయి విజ‌యం చేకూరుతుంద‌ని వారు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా గ‌ణ‌ప‌తికి తుల‌సి ద‌ళాల‌ను మాత్రం నైవేద్యంగా పెట్ట‌కూడ‌దని ఇది ప్ర‌తి ఒక్క‌రు గుర్తుంచుకోవాల‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts