Bhunja : కాస్త సమయం దొరికితే చాలు.. చాలా మంది ఏవైనా స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే బయటకు వెళితే మనకు తినేందుకు అనేక రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన స్నాక్స్ అయితేనే మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. అలాంటి స్నాక్స్‌లో భుంజా కూడా ఒకటి. వాస్తవానికి ఇది బీహార్‌కు చెందిన వంటకం. కానీ దీన్ని ఇంట్లోనే మనం కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లో వెదికితే బోలెడు రెసిపిలు మనకు లభిస్తాయి. ఇందులో వాడే మెయిన్ పదార్థం.. మరమరాలు. వీటిని నేరుగా తింటే రుచిగా ఉండవు. కానీ వీటిలో చాట్ మసాలా, పచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి, కొత్తిమీర వంటివి కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దాన్నే భుంజా అని పిలుస్తారు.
భుంజాను వాస్తవానికి చిరుతిండిగా చూడకూడదు. ఎందుకంటే దీని తయారీలో నూనె వాడరు. అందువల్ల దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ అని చెప్పవచ్చు. ఓవైపు కారం రుచిని ఆస్వాదిస్తూనే మరో వైపు దీని ద్వారా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. భుంజాలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. భుంజాలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణ సమస్యలు ఉండవు. భుంజాలో క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యవంతమైన స్నాక్స్ అని చెప్పవచ్చు.
భుంజాలో కలిపేవి అన్నీ సహజసిద్ధమైనవే. అందువల్ల వీటితో మన ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. పైగా కూరగాయలు ఉంటాయి కనుక మనకు పోషకాలు కూడా లభిస్తాయి. భుంజా జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పల్లీలు, శనగలు కలిపి తింటారు కనుక ప్రోటీన్లు లభిస్తాయి. ఇలా భుంజాను తినడం వల్ల ఓవైపు జిహ్వా చాపల్యాన్ని తీర్చుకుంటూనే మరో వైపు ఆరోగ్యాన్ని, పోషకాలను పొందవచ్చు.