ఆధ్యాత్మికం

Hanuman Chalisa : అసలు హనుమాన్ చాలీసా ఎలా వచ్చిందో తెలుసా..? దాని వెనుక ఇంత పెద్ద కథ ఉంది..!

Hanuman Chalisa : ఎప్పుడూ మనం హనుమాన్ చాలీసా చదువుకుంటుంటాము. కానీ అసలు ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియదు. దాని గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. తులసీ దాస్ వారణాసిలో ఉండేవారు. ఆయన ఎప్పుడూ కూడా రామ నామాలతో ఆనందంగా ఉండేవారు. వారణాసిలో ఉన్న ఒక సదాచారవంతుడైన గృహస్తు ఏకైక కొడుకుకి,ఒక అందమైన అమ్మాయితో పెళ్లి అయింది. కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది, తల బాదుకుంటూ ఆమె ఎంతో బాధపడింది. శవాన్ని పాడె మీద పడుకోబెట్టి మోసుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళకుండా అడ్డుపడింది.

అక్కడ ఉన్న స్త్రీలు అందరూ బలవంతంగా పట్టుకొని శవయాత్రని కొనసాగించారు. శ్మ‌శానానికి వెళ్లే మార్గంలో తులసీ దాస్ ఆశ్రమం ఉంది. అలా వెళ్తున్నప్పుడు తులసీ దాస్ ఆశ్రమానికి వెళ్లి ఆమె ఆయన కాళ్ల‌ మీద పడింది, తులసీ దాస్ దీర్ఘ సుమంగళీభవ అని దీవించారు. ఇక ఆమె ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. తప్పేముంది నేను దీవించిన దాంట్లో అన్నారు తులసీ దాస్. నా నోట రాముడు అసత్యం పలికించాడని తులసీ దాస్ చెప్పారు.

ఇంకెక్కడ సౌభాగ్యం నా తలరాత, నా పసుపు కుంకుమలు మంటల్లో కలపడానికి వెళ్తున్నారంటూ ఆమె బాధపడింది. తులసీ దాస్ ఆపండి అని ఆ శవం కట్లు విప్పి, రామ నామం జపించి కమండలంలో ఉన్న నీళ్ల‌ని చల్లారు. ప్రాణం వచ్చింది. అది చూసిన ప్రజలు జేజేలు పలుకుతూ, భక్తి పూర్వకంగా నమస్కరించడం మొదలుపెట్టారు. ఇదే టైంలో అమాయకుల్ని మోసం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు కొందరు.

do you know how hanuman chalisa came

ఢిల్లీ పాదుషా విచారణ కోసం సంత్ గారిని ఢిల్లీ దర్బార్ కి పిలిచారు. రామనామము అన్నిటికన్నా గొప్పదని మీరు ప్రచారం చేస్తున్నారు. నిజమా అని పాదుషా ప్రశ్నించారు. అవునని ఆయన బదులిచ్చారు. రామనామంతో దేనినైనా సాధించవచ్చా అంటే, అవునని బదులిచ్చారు. మరణాన్ని కూడా జయించచ్చా అంటే, అవునని చెప్పారు. ఇప్పుడు శవాన్ని తెప్పిస్తాము రామ నామం ద్వారా బతికించండి, అప్పుడు నమ్ముతానని ఆయన చెప్తారు.

క్షమించాలి. జనన, మరణాలు మన చేతుల్లో లేవు. భగవంతుడి చేతిలో ఉన్నాయని ఆయన చెప్తారు. మీరు మీ మాటల్ని నిలబెట్టుకోలేక అబద్ధాలు చెబుతున్నారంటూ ఆయన చెప్తారు. ఇదే మీకు ఆఖరి అవకాశం. రామ నామం మహిమ అబద్ధమని చెప్పండి. లేదంటే శవాన్ని బతికించండి అని మొండిగా అజ్ఞాపిస్తారు. తులసి దాస్ మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. తులసి దాస్ ని బంధించమని ఆజ్ఞ ఇచ్చారు.

ఎక్కడినుండి వచ్చాయో తెలీదు వేలాది కోతులు సభలోకి వచ్చాయి. తులసీదాస్ ని బంధించే సైనికుల వద్ద, ఇతర సైనికుల వద్ద ఆయుధాలను లాగేసుకుని ఎవరిని కదలకుండా చేశాయి. తులసి దాస్ గారికి ఆశ్చర్యం వేసింది. సింహద్వారం మీద హనుమంతుడు కనపడ్డారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర.. అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించారు తులసీదాస్. హనుమంతుడు అది విని నీకేం కావాలో కోరుకో అని చెప్తారు. అప్పుడు తులసీదాస్ ఎవరైతే మిమ్మల్ని ఈ స్తోత్రం తో కొలుస్తారో, వాళ్లకి అభయమివ్వాలని విన్నవించుకున్నారు. ఇలా హనుమాన్ చాలీసా వచ్చింది.

Admin

Recent Posts