వినోదం

Samantha : త‌న కెరీర్ ఆరంభంలో సమంత ఎలా ఉందో చూశారా ? అస‌లు గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉంది..!

Samantha : స‌మంత ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లో ఎన్న‌డూ లేనంత బిజీగా మారిపోయింది. వ‌రుస సినిమాల‌తో జోరు మీదుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేన‌ప్ప‌టికీ ఈమె చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి స‌క్సెస్ సాధించింది. త‌న తొలి చిత్రం ఏం మాయ చేశావెతో హిట్ కొట్టిన ఈమె ఆ త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు వ‌రుస‌గా హిట్స్ వ‌చ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

అయితే స‌మంత‌ను త‌న కెరీర్ ప్రారంభంలో చూసి ఇప్పుడు చూస్తే ఎన్నో తేడాలు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు. ఆమె ముఖాన్ని స‌ర్జ‌రీ చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి స‌మంత‌కు, ఇప్ప‌టి స‌మంత‌కు చాలా తేడాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే ఈమె కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేదో చాలా మందికి తెలియ‌దు. కానీ అప్ప‌ట్లో ఆమె పూర్తి భిన్నంగా ఉండేది. మొద‌ట్లో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించింది. త‌రువాత మోడ‌ల్ అయింది. ఆ త‌రువాత సినిమాల్లోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె అప్ప‌ట్లో చేసిన ఓ యాడ్ తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అందులో స‌మంత‌ను చూసి.. ఆమె ఇప్ప‌టి ఫొటోల‌ను చూస్తే అస‌లు గుర్తు ప‌ట్ట‌రాకుండా ఉంది.

samantha career starting how was she

ఇక స‌మంత అప్ప‌ట్లో ఆషిక అనే గోల్డ్ కంపెనీకి చెందిన యాడ్‌లో న‌టించింది. అదే యాడ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆమెలో అప్ప‌టికి, ఇప్ప‌టికి ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని మ‌న‌కు సుల‌భంగా తెలిసిపోతుంది.

Admin