Cut Mirchi Bajji : క‌ట్ మిర్చి బ‌జ్జీని ఎలా త‌యారు చేయాలంటే..?

Cut Mirchi Bajji : సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకుని తినే వాటిలో మిర్చి బ‌జ్జీ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌ల‌తో క‌లిపి తింటే మిర్చి బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. మిర్చి బ‌జ్జీని మ‌రింత రుచిగా క‌ట్ మిర్చి బజ్జీలా కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. చాలా సులువుగా వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ట్ మిర్చి బ‌జ్జీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

do you know how to prepare Cut Mirchi Bajji
Cut Mirchi Bajji

క‌ట్ మిర్చి బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

బ‌జ్జీ మిర్చి – పావు కిలో, శ‌న‌గ పిండి – పావు కిలో, కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వాము – అర టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – చిటికెడు, చాట్ మ‌సాలా – అర టేబుల్ స్పూన్, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, నీళ్లు – త‌గిన‌న్ని, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్.

క‌ట్ మిర్చి బ‌జ్జీ త‌యారీ విధానం..

ముందుగా బ‌జ్జీ మిర్చిని తీసుకుని క‌త్తితో పొడుగ్గా ఒక వైపు గాటు పెట్టి లోప‌ల ఎక్కువ‌గా ఉండే గింజ‌ల‌ను తీసేయాలి. ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండితోపాటు వాము, బేకింగ్ సోడా, ఉప్పును వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్ల‌ను పోసుకుంటూ ఉండ‌లు లేకుండా బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత మిర్చిని శ‌న‌గ పిండి మిశ్ర‌మంలో ముంచి బ‌జ్జీల‌లా వేసి బంగారు వ‌ర్ణం వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు బ‌జ్జీల‌ను కావ‌ల్సిన ప‌రిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముక్క‌లను మ‌ళ్లీ నూనెలో వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి గిన్నె లోకి తీసుకోవాలి. ఇలా వేయించిన బ‌జ్జీ ముక్క‌లపై కారం, చాట్ మ‌సాలా, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర‌, నిమ్మ ర‌సం వేసి కలుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా బ‌య‌ట దొరికే వాటిలా ఉండే క‌ట్ మిర్చి బ‌జ్జీ త‌యార‌వుతుంది. వీటిని నేరుగా లేదా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల‌లో త‌ర‌చూ చేసుకునే మిర్చి బ‌జ్జీకి బ‌దులుగా ఇలా క‌ట్ మిర్చి బ‌జ్జీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.

D

Recent Posts