Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం అతడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ మూవీని ముందుండి నడిపించారు. అలాగే మహేష్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా ఆకట్టుకుంది అతడు చిత్రం. మరి ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు.
మొట్టమొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడట. కానీ ఆ సమయంలో చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు. అల్లు అరవింద్ ఈ సినిమా ఉదయ్ కిరణ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో అతడు సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపారట. కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేయటం జరిగింది.
దాంతో త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం అతడు చిత్రంపై మరొక విషయం వినిపిస్తోంది.
అతడు చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడని వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ వేణు తొట్టెంపూడి ఈ సినిమా చేయనని త్రివిక్రమ్ తో చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేశాడని, కానీ తానే రిజెక్ట్ చేశానని వేణు ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.