food

ఆంధ్ర స్పెషల్ టమోటా రసం తయారీ విధానం

ఆంధ్ర భోజనం అంటే తప్పకుండా భోజనంలో టమోటో రసం ఉండాల్సిందే. టమోటో రసం లేకపోతే భోజనం వెలితిగానే ఉంటుంది. ఎంతో ప్రత్యేకమైన, రుచికరమైన టమోటా రసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

బాగా పండిన టమోటాలు ఐదు, నిమ్మకాయ సైజు చింతపండు, అరటేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారంపొడి, రసం పొడి, తగినన్ని నీరు, కొత్తిమిర, రెండు ఎండు మిర్చి, అర టేబుల్ స్పూన్ ఆవాలు.

andhra special tomato rasam how to make this know the recipe

తయారీ విధానం

ముందుగా కుక్కర్లో టమోటాలను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేసి, చింతపండు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. విజిల్ వెళ్ళిన తర్వాత కాస్త ఉప్పును వేసి టమోటా ముక్కలను బాగా స్మాష్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత నీటిని వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, తగినంత కారం, చిటికెడు ధనియాల పొడి కలుపుకోవాలి. మరొక గిన్నెలో పోపుకోసం కొద్దిగా నూనె వేసే నూనె వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. పోపు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు రసం పొడి అందులో వేసి బాగా కలియబెట్టాలి. ఒక నిమిషం పాటు రసం పొడి మగ్గిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న టమోటా రసాన్ని బాగా మగ్గిన పోపులో వేయాలి. తరువాత స్టవ్ సిమ్ లో పెట్టి ఈ రసాన్ని బాగా ఉడికించాలి. ఈ విధంగా పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దించేముందు కొత్తిమీర తురుము వేస్తే ఎంతో రుచికరమైన టమోటో రసం తయారైనట్లే.

Admin

Recent Posts