food

రుచికరమైన అటుకుల లడ్డు తయారీ విధానం

లడ్డూ అంటే కేవలం బూందితో మాత్రమే కాకుండా వివిధ రకాల రవ్వతో తయారు చేస్తారు అనేది మనకు. అయితే ఈ క్రమంలోనే అటుకుల లడ్డూలు తయారు చేయడం మనం చూస్తుంటాము. మరి ఎంతో రుచికరమైన అటుకుల లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

అటుకులు రెండు కప్పులు, పంచదార ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి 1 స్పూన్, నెయ్యి ఒక కప్పు, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు కొద్దిగా.

how to make very tasty atukula laddu

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అటుకులు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న అటుకులను చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో పంచదార, యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అటుకుల పొడి పంచదార యాలకుల మిశ్రమం, జీడిపప్పు కిస్మిస్ కలిపి కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల మాదిరిగా చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల లడ్డూలు తయారైనట్లే.

Admin

Recent Posts