చిట్కాలు

వంటింటి మసాలలతో రోగనిరోధక శక్తిని పెంచుకోండిలా!

ప్రస్తుత కాలంలో మన ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు వెంటనే ఇంగ్లీష్ మందులను వేసుకుని ఉపశమనం పొందుతాము. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా తరచు మనం అనారోగ్యానికి గురి కాకుండా శాశ్వతంగా అనారోగ్యాన్ని తగ్గించే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయనే విషయం మర్చిపోయారు. అయితే చాలామంది మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

* పసుపు: పసుపు ఎన్నో ఔషధ గుణాల నిలయం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

you can increase immunity power with kitchen spices

* మిరియాలు: ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిరియాలతో పాటు కొద్దిగా పసుపు, తులసి ఆకులను వేయడం ద్వారా వాటిలో ఉన్న పోషకాలు నీటి ద్వారా మన శరీరంలోనికి గ్రహించబడి మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

* మన వంటింట్లో దొరికే వాము, జీలకర్ర, మెంతులు వంటి దినుసులు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరానికి ఒత్తిడిని తగ్గించే హార్మోన్ లను విడుదల చేయడంలో దోహదపడతాయి. ఈ విధమైన మసాలాదినుసులన్నింటినీ కలిపి బాగా మరిగించి కషాయం తయారుచేసుకొని ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగటం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

Admin

Recent Posts