Upma : ఉప్మా పొడిగా ఉంటేనే చాలా మందికి న‌చ్చుతుంది.. దాన్ని ఇలా చేసుకోవ‌చ్చు..!

Upma : ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార ప‌దార్థాల‌లో ఉప్మా ఒక‌టి. ఉప్మాని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దీనిని ఏవిధంగా త‌యారు చేసినా, ఎంత రుచిగా త‌యారు చేసినా కూడా దీనిని చాలా మంది తిన‌రు. ఉప్మాను ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌లో ఉప్మా పొడి పొడిగా లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఉప్మాను చాలా పొడి పొడిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను పొడి పొడిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

dry Upma will be very tasty if you do like this method
Upma

పొడి పొడిగా ఉండే ఉప్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉప్మా ర‌వ్వ‌ – ఒక క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీడి ప‌ప్పు – 10, క‌రివేపాకు – ఒక రెబ్బ, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన అల్లం ముక్క‌లు – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక‌టింపావు క‌ప్పు.

పొడి పొడిగా ఉండే ఉప్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఉప్మా ర‌వ్వ‌ను వేసి చిన్న మంటపై వేయించి ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. అదే క‌ళాయిలో నెయ్యిని వేసి వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పును వేసి చిన్న మంటపై వేయించాలి. ఇవి వేగిన త‌రువాత జీడి ప‌ప్పును వేసి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. ఆ త‌రువాత అల్లం కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వేగిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి నీళ్లను మ‌రిగించాలి. నీళ్లు మరిగిన త‌రువాత వేయించి పెట్టిన ర‌వ్వ‌ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ‌లు క‌ట్టకుండా క‌లుపుకోవాలి. ఉప్మాను బాగా క‌లిపిన త‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల త‌రువాత మూత తీసి కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా పొడి పొడిగా ఉండే ఉప్మా త‌యార‌వుతుంది. దీనిని ప‌ల్లీ చట్నీ, ట‌మాట చట్నీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను తిన‌ని వారు కూడా ఇలా త‌యారు చేసిన ఉప్మాను ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts