Egg French Fries : సాయంత్రం స‌మ‌యంలో కోడిగుడ్ల‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Egg French Fries : సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది వివిధ ర‌కాల స్నాక్స్‌ను చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్ల‌తోనూ స్నాక్స్ చేస్తుంటారు. అయితే వాటితో ఎంతో రుచిగా ఉండేలా ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను చేయ‌వ‌చ్చు. ఇవి సాయంత్రం స‌మ‌యంలో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 5, ఉప్పు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, చిల్లి ఫ్లెక్స్ – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – ఒక టీస్పూన్, బ్రెడ్ ముక్కలు – 2, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.

Egg French Fries recipe in telugu make in this method
Egg French Fries

ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఈ కోడిగుడ్లలో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర తురుము, చిల్లి ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక వెడల్పాటి బాక్స్ తీసుకుని అందులో వేయాలి. తరువాత స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్ లో ఎలాంటి నీరు పోయకుండా కోడిగుడ్డు మిశ్రమం వేసుకున్న గిన్నెను అందులో పెట్టి మూత పెట్టి కేవలం ఆవిరికి మాత్రమే కోడిగుడ్డు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.

ఈ విధంగా ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దానిని ఒక ప్లేట్లుపై బోర్లాల వేస్తే ఉడికిన కోడిగుడ్డు మిశ్రమం నీట్‌గా ప్లేటులో పడుతుంది. ఇప్పుడు దీనిని కత్తి తీసుకొని వేలి పొడవు సైజులో కట్ చేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేసి మరిగించుకోవాలి. అదేవిధంగా బ్రెడ్ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఎగ్ పీసెస్ ను బ్రెడ్ పౌడర్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో వేస్తూ బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలను వేయించుకున్న తరువాత వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ ను టమోటా కెచప్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Editor

Recent Posts