Ghee : నెయ్యిని అస‌లు రోజూ ఎంత ప‌రిమాణంలో తీసుకోవాలి..?

Ghee : సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

నెయ్యిలో సహజసిద్ధమైన కొవ్వులు, పోషకాలు మన శరీరంలో కణజాలాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని వివిధ జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. అయితే మోతాదుకు మించి నెయ్యి ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అధిక మొత్తంలో నెయ్యి తినడం వల్ల అతిసారం, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం, జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా తగిన పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం.

how much ghee we can take per day
Ghee

సాధారణంగా మనం తయారు చేసే వంటకాలలో నెయ్యిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి రోజు నెయ్యి అందుతుంది. అయితే చిన్నపిల్లలలో వారికి మరింత పోషణ అవసరం కనుక చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరికాస్త నెయ్యి జోడించాలి. ఏడు నెలల చిన్నారులకు పెట్టే ఘన ఆహార పదార్థాలలో రోజుకు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి తినిపించాలి. అదేవిధంగా సంవత్సరం వయసు ఉన్న పిల్లలలో ప్రతిరోజు అర టీ స్పూను నెయ్యి వేసి తినిపించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక పెద్ద‌లు రోజుకు 1 టీస్పూన్ మోతాదులో నెయ్యి తింటే చాలు.. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే కొలెస్ట్రాల్‌, షుగర్‌, బీపీ, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు నెయ్యి తీసుకోవ‌చ్చు. దీంతో లాభాల‌ను పొందుతారు.

Share
Editor

Recent Posts