Egg Fries : మనం కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3, కోడిగుడ్లు – కోడిగుడ్లు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – కొద్దిగా, మిక్డ్స్ స్పైసెస్ పౌడర్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని సన్నగా, పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత వాటిపై ఉండే తడి అంతా పోయేలా టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్లను వేసుకోవాలి. అలాగే నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను తగినన్ని వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ వేయించాలి. ఈ బంగాళాదుంప ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారవుతాయి. టమాట కిచప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.