Jabardasth Varsha : జబర్దస్త్ షోతోపాటు పలు ఇతర షోలలో రష్మి, సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి తరచూ చూపిస్తుంటారు. ఇక వీరి లాగే ఇంకో జంట కూడా పాపులర్ అయింది. ఇమ్మాన్యుయెల్, వర్షలు కూడా లవ్ చేసుకుంటున్నారని.. వీరి మధ్య ఓ లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. ఈ క్రమంలోనే పలు షోలలో వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అవుతుంటుంది. వీరు చేసే స్కిట్‌లను చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఇమ్మాన్యుయెల్, వర్షల మధ్య లవ్ ట్రాక్‌ను నడిపిస్తూ షోలకు రేటింగ్స్ తెప్పిస్తుంటారు. అయితే హోలీ పండుగ సందర్భంగా మల్లెమాల వారు నిర్వహించిన రంగ్‌దే అనే స్పెషల్ షోలో మాత్రం దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇమ్మాన్యుయెల్ వర్షపై దారుణమైన కామెంట్లు చేశాడు. దీంతో ఆమె ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయింది.
ఈ నెల 20వ తేదీన హోలీ పండుగ సందర్భంగా ఈటీవీలో రంగ్‌దే అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను తాజాగా పూర్తి చేశారు. అయితే ఈ షోను మల్లెమాల వారు తెరకెక్కించారు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ పాల్గొన్నారు. నటి ప్రేమ, నటుడు పృథ్వీలు ఈ షోకు చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే షోలో భాగంగా అందరూ ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకున్నారు. ఇందులో పాల్గొన్న హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్‌లు కూడా తమదైన శైలిలో అలరించారు. ఈ షోకు చెందిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఇక ఆ ప్రోమోలో ఒక సందర్భంలో వర్షను ఇమ్మాన్యుయెల్ అమ్మాయి కాదని.. మగవాడని అన్నాడు. ఆడవాళ్లు ఒక సైడ్, మగవాళ్లు ఒక సైడ్ కూర్చుని పంచ్‌లు వేసుకునే సమయంలో ఇమ్మాన్యుయెల్ వర్షపై అలా దారుణమైన కామెంట్స్ చేశాడు. ఆమె అమ్మాయి కాదు, మగవాడు, ఆమె మనవైపు ఉండాలి కదా.. అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. దీంతో వర్ష బాగా హర్ట్ అయింది. అయితే పుండు మీద కారం చల్లినట్లు భాస్కర్ మళ్లీ అలాంటి కామెంట్లే చేశాడు.
పదే పదేలా అనొద్దని భాస్కర్ ఇమ్మాన్యుయెల్‌కు సూచించాడు. అలా అనడం వల్ల బయట అందరూ వర్ష అమ్మాయి కాదా.. అని అడుగుతున్నారని.. తన భార్య కూడా తనను ఇదే విషయం అడుగుతుందని.. భాస్కర్ అన్నాడు. దీంతో వర్ష ఇంకా హర్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆమె స్టేజి దిగి కిందికి వచ్చేసి అక్కడి నుంచి బయటకు వెళ్లే యత్నం చేసింది. ఆమెను రాంప్రసాద్ ఆపి ఇమ్మాన్యుయెల్‌తో సారీ చెప్పించాడు. అయితే ఇమ్మాన్యుయెల్ ఏదో మొక్కుబడిగా సారీ చెప్పాడు. దీంతో మళ్లీ సారీ చెప్పాలని అడగ్గా.. అసలు నేనెందుకు సారీ చెప్పాలన్నా.. నన్ను కూడా చాలా సార్లు కామెంట్ చేసింది కదా.. అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఆది కూడా కలగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వర్ష వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక ఈ స్పెషల్ షో ఈ నెల 20వ తేదీన ప్రసారం కానుండగా.. కేవలం రేటింగ్స్ కోసమే ఇలా చేశారా ? నిజంగానే ఆ సంఘటన జరిగిందా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ షోకు చెందిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.