vastu

House Vastu : శ్రీ‌మంతులు అవ్వాలంటే.. ఈ వాస్తు నియ‌మాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..!

House Vastu : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండి, ఆనందంగా జీవించాలని అనుకుంటారు. మీరు కూడా శ్రీమంతులు అవ్వాలనుకుంటున్నారా..? అయితే, కచ్చితంగా ఈ వాస్తు నియమాలని పాటించండి. ఇలా కనుక చేశారంటే, ఇక డబ్బుకి కొరత ఉండదు. ఆర్థిక బాధలు కూడా ఉండవు. ధనవంతులైపోవచ్చు. సంపద బాగా వృద్ధి చెందాలంటే, ఇల్లు ఉత్తర దిశలో ఉంటే మంచిది.

ఇల్లు ఉత్తర దిశలో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎలాంటి ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్ వంటివి లేకుండా చూసుకోండి. కరెంటు స్తంభాల‌ వంటివి ఇంటికి ఎదురుగా ఉండడం మంచిది కాదు. ఈశాన్యం వైపు బీరువా పెట్టడం వలన సంపద నిలవదు. ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. కనుక ఈశాన్యం వైపు బీరువాని పెట్టకుండా చూసుకోండి. ఈ ప్రదేశం ఎప్పుడూ ఓపెన్ గా ఉండాలి. అప్పుడే మంచి ఫలితం కనబడుతుంది.

follow these vastu rules if you want to become rich

ఉత్తరం కుబేరుడికి మంచి ప్రదేశం. సంపద పెరుగుతుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే, లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, ఆర్థిక బాధలు ఉండవు. ఇంట్లో చేపల తొట్టి ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇంట్లో చేపల తొట్టి ఉన్నట్లయితే, నీళ్లని ఎప్పటికప్పుడూ మార్చుకుంటూ ఉండండి.

చేపలు చురుకుగా అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఇంట్లో సంపద బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలానే, బెడ్రూంలో కిటికీలు కనీసం 20 నిమిషాలు అయినా రోజూ తెరిచి ఉంచాలి. అప్పుడు నెగెటివ్ ఎనర్జీ తొలగి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే, ఇంట్లో గడియారాలు ఎప్పుడూ పనిచేసేలా చూసుకోండి. గడియారాలు పనిచేయకపోతే బాగు చేయించుకోవాలి. వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఈ ఇంటి చిట్కాలు కనుక పాటించినట్లయితే, ధనవంతులు అవ్వచ్చు. ఆర్థిక బాధల నుండి బయట పడొచ్చు.

Admin

Recent Posts