Quarrel : భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజం. కానీ కొందరు ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉంటారు. ఇలా గొడవలు పడడం వల్ల ఇంట్లో మనఃశాంతి లేకుండా పోతుంది. ఇలా తరచూ గొడవలు పడడం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా తరచూ గొడవలు పడుతున్న వారి ఇండ్లలో పిల్లలు కూడా తీవ్రమైన మనస్థాపానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. వారి చదువు దెబ్బ తిని వారు చెడు మార్గంలో వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
మన ఇంట్లో గొడవలు తగ్గి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మన వంట గదిలో కింద చెప్పిన విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతోపాటు మనకు ఉండే బాధలు, కష్టాలు కూడా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గి సంపాదించిన ధనం వృథా కాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం అంతా పోయి మన దగ్గర డబ్బు నిల్వలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. మనకు ఉన్న సమస్యలన్నింటినీ తీర్చే ఆ పరిహారం ఏమిటి.. ఈ పరిహారాన్ని వంట గదిలో ఏవిధంగా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో తరచూ గొడవలు పడుతున్న వారు లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు మంగళ వారం లేదా శనివారం ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. మంగళవారం లేదా శనివారం రోజు గాజు పాత్రలను తీసుకుని అందులో రాళ్ల ఉప్పును ఉంచాలి. ఈ రాళ్ల ఉప్పు మీద 5 లవంగాలను ఉంచి మన ఇంట్లో ఉండే వంట గదిలో నాలుగు మూలలా ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గడమే కాకుండా ఆర్థిక బాధలు, అప్పులు అన్నీ పోతాయని, మనం సంపాదించిన ధనం వృథా కాకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.