Gomathi Chakra For Money : వీటిని ప‌ర్సులో పెట్టుకోండి.. డ‌బ్బు వ‌స్తూనే ఉంటుంది..!

Gomathi Chakra For Money : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభరాశిలో రోహిణి లేదా తులా రాశిలో స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో, సోడియం లేదంటే క్యాల్షియం లేదంటే కార్బన్ సహాయంతో ఇవి రూపొందుతాయి. ఇవి శుక్ర గ్రహానికి చెందినవి. శుక్రుడు.. భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవి సోదరుడు. కాబట్టి ఈ చక్రాల వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

Gomathi Chakra For Money put them in purse for wealth
Gomathi Chakra For Money

గోమతి చక్రంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది ఇది. దీన్నే నాగచక్రం, విష్ణు చక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి బాధ‌ల నుండి బయటపడొచ్చు. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి. బీరువాలో కానీ పర్సులో కానీ వీటిని ఉంచితే మీకు ధన లాభం కలుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. రెండు గోమతి చక్రాలని భార్యాభర్తలు నిద్రించే పరుపు మీద పెట్టుకుంటే భార్యాభర్తలు మధ్య గొడవలు రావు.

అన్యోన్యంగా భార్యాభర్తలు జీవించొచ్చు. తెల్లటి గోమతిచక్రాలను అయితే పూజా కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తారు. సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ఉపయోగపడతాయి. ఎర్రగా వుండే గోమతిచక్రాలు అయితే తాంత్రిక ప్రయోగాలకి, వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి వాడతారు. ఎవరైనా జాతకంలో కుజ, శుక్రు గ్రహాలు బలహీనంగా ఉంటే గోమతిచక్రాలని వేసుకుంటే సమస్యలే వుండవు.

Editor

Recent Posts