Korrala Idli : కొర్ర‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీ.. మెత్త‌గా స్పాంజిలా ఉంటాయి.. ఇలా చేయాలి..!

Korrala Idli : చిరుధాన్యాలైన కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొర్ర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇలా అనేక విధాలుగా కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొర్ర‌ల‌తో కేవ‌లం అన్నాన్నే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల‌తో ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఈ ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొర్ర‌ల‌తో రుచిగా, మెత్త‌గా ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్ర‌ల ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌ప్పు – ఒక క‌ప్పు, కొర్ర‌లు – 2 క‌ప్పులు, మెంతులు – పావు టీ స్పూన్, అటుకులు – ముప్పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Korrala Idli recipe in telugu very healthy and tasty
Korrala Idli

కొర్ర‌ల ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప‌ప్పు, మెంతులు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. అలాగే కొర్ర‌ల‌ను కూడా మ‌రో గిన్నెలో తీసుకుని క‌డిగి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. కొర్ర‌లు నానిన త‌రువాత మ‌రో గిన్నెలో అటుకులు వేసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఇప్పుడు ఒక జార్ లో మిన‌ప‌ప్పు, అటుకులు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకున్న త‌రువాత అదే జార్ లో కొర్ర‌లు వేసి రవ్వ‌లాగా మిక్సీ ప‌ట్టుకుని పిండిలో వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి పిండిని రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో 2 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యేలోపు ఇడ్లీ ప్లేట్ లల్లో పిండిని వేసుకోవాలి. నీళ్లు వేడ‌య్యాక ప్లేట్ ల‌ను ఉంచి మూత పెట్టాలి. ఈఇడ్లీల‌ను పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు 15 నిమిషాలు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొర్ర‌ల ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని సాంబార్, చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు, అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఇలా కొర్ర‌ల‌తో ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది.

D

Recent Posts