Gongura Royyalu : గోంగూర, రొయ్య‌ల‌ను క‌లిపి ఇలా వండితే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Gongura Royyalu : మ‌నం రొయ్య‌ల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంటకాల్లో గోంగూర రొయ్య‌లు కూడా ఒక‌టి. గోంగూర‌, రొయ్య‌లు క‌లిపి చేసేఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర రొయ్య‌ల కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర రొయ్య‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రొయ్య‌లు – అర‌కిలో, ఉప్పు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్, గోంగూర – 2 క‌ట్ట‌లు( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చిమిర్చి – 7 నుండి 8, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాట – 1, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Gongura Royyalu recipe make like this everybody likes it
Gongura Royyalu

గోంగూర రొయ్య‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రొయ్య‌లు, ఉప్పు, కారం, ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. రొయ్య‌లల్లో ఉండే నీరంతా పోయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో గోంగూర‌, ప‌చ్చిమిర్చి, ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. గోంగూర‌, ప‌చ్చిమిర్చి మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ గోంగూర‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు దోర‌గా వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉడికించిన రొయ్య‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత గోంగూర వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్య‌ల కూర త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన రొయ్య‌ల కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts