Mosquitoes In Summer : ఈ సీజ‌న్‌లోనూ దోమ‌లు మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Mosquitoes In Summer : వేస‌వికాలంలో ఎండ‌ల‌తో పాటు మ‌నం ఎదుర్కొనే మ‌రో స‌మ‌స్య దోమ‌లు. వేస‌వికాలంలో ఉండే పొడి వాతావ‌ర‌ణం కార‌ణంగా దోమ‌లు విజృంభిస్తాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దోమ కాటు గురి అవ్వ‌డం వ‌ల్ల దుర‌ద‌, దద్దుర్ల‌తో పాటు మ‌నం విష జ్వ‌రాల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. అయితే చాలా మంది వీటి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే కాయిల్స్, స్ప్రేల‌నువాడుతూ ఉంటారు. వీటి వాడ‌కం అస్స‌లు మంచిది కాదు. వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా తుమ్ములు, అల‌ర్జీ, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే కొంద‌రు లోష‌న్ల‌ను కూడా వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

క‌నుక వీటికి బదులుగా దోమ‌ల‌ను నివారించే స‌హ‌జ ప‌ద్ద‌తుల‌ను వాడ‌డం మంచిది. దోమ‌ల బెడద ఎక్కువ‌గా ఉన్న వారుదోమ తెర‌ల‌ను వాడ‌డం మంచిది. అలాగే ఎండిన వేపాకుల‌ను సేక‌రించి వాటిని కాల్చాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆకుల నుండి వ‌చ్చే పొగ కార‌ణంగా దోమ‌లు పారిపోతాయి. అలాగే దోమ‌కాటుకు గురి కాఉండా ఉండేందుకు వాడే లోష‌న్ల‌కు బ‌దులుగా స‌హ‌జ సిద్ద నూనెల‌ను వాడ‌డం మంచిది. నిమ్మ‌గ‌డ్డి నూనె, ల‌వంగం నూనెల‌ను వాడ‌డం వ‌ల్ల వీటి నుండి వ‌చ్చే ఘాటైన వాస‌న కార‌ణంగా దోమ‌లు మ‌న ద‌గ్గ‌రికి రాకుండా ఉంటాయి. అలాగే ఒక గిన్నెలో 5 బిర్యానీ ఆకుల‌ను, ఒక క‌ర్పూరాన్ని, ల‌వంగాల‌ను, 1 లేదా 2 టీ స్పూన్ల ఆవ‌నూనెను వేసి కాల్చాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దీని నుండి వ‌చ్చే పొగ కార‌ణంగా దోమ‌లు ఇంట్లో నుండి వెళ్లిపోతాయి.

Mosquitoes In Summer wonderful tips to follow
Mosquitoes In Summer

దోమ‌ల బెడ‌ద‌ను త‌గ్గించ‌డంలో ఈ చిట్కా చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అలాగే ఒక స్ప్రే బాటిల్ నీటిని తీసుకోవాలి. ఇందులో వెల్లుల్లి ర‌సాన్ని లేదా దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఇంట్లో మూల‌ల‌కు, ఇంటి బ‌య‌ట చెట్ల‌పై స్ప్రే చేయ‌డం వ‌ల్ల దోమ‌లు రాకుండా ఉంటాయి. వీటితో పాటు ఇంటి ప‌రిస‌రాల్లో నీరు నిల్వ‌కుండా చూసుకోవాలి. కూల‌ర్ ల‌ల్లో నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం స‌హ‌జ సిద్దంగా దోమ‌ల బెడ‌ద నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించడం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి హాని కూడా క‌ల‌గకుండా ఉంటుంది.

D

Recent Posts