Green Chilli Aloo Fry : రొటీన్‌గా చేసే ఆలు ఫ్రై కాకుండా.. ఇలా ప‌చ్చి మిర్చి వేసి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Green Chilli Aloo Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఆలూ ఫ్రై కూడాఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఆలూ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే ఈ ఆలూ ఫ్రై ను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎప్పుడూ ఎండుకారం మాత్ర‌మే కాకుండా ప‌చ్చికారం వేసి కూడా ఆలూ ఫ్రైను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసే ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కూడా అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ ఆలూ ఫ్రైను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా ప‌చ్చికారం వేసి ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ చిల్లీ ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన బంగాళాదుంప‌లు – పెద్ద‌వి రెండు, ప‌చ్చిమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్.

Green Chilli Aloo Fry recipe in telugu make in this way
Green Chilli Aloo Fry

గ్రీన్ చిల్లీ ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. ముక్క‌లు వేగుతుండ‌గానే ఒక జార్ లో ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. బంగాళాదుపం ముక్క‌లు క్రిస్పీగా వేగిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చిల్లీ ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts