Onion Tea : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కూర్చుని చేసే ఉద్యోగాలు చేయడం వంటి కారణాల చేత చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెపోటుతో పాటు వివిధ రకాల గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే ఈ గుండెపోటు కారణంగా మనం ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.
ఇటువంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. చక్కటి జీవన విధానాన్ని పాటిస్తూ సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మనం చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో పాటు మన ఇంట్లో ఉండే పదార్థాలతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం మరింత సులభంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి. తరువాత ఇందులో ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో ఒక యాలక్కాయ, రెండు దంచిన మిరియాలు, అర టీ స్పూన్ సోంపు గింజలు వేసి 5 నుండి 8 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత దీనిని గోరు వెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది. ఈ పానీయాన్ని తాగడం వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.