Guthi Vankaya Kura Recipe : గుత్తి వంకాయ కూర‌ను ఇలా వండితే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Guthi Vankaya Kura Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల్లో కూడా మ‌న శ‌ర‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల్లో ఒక ర‌క‌మైన గుత్తి వంకాయ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాం. గుత్తి వంకాయ‌ల‌తో చేసే మ‌సాలా కూరను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. త‌ర‌చూ చేసే గుత్తి వంకాయ కూర కంటే కింద చెప్పిన విధంగా చేసే గుత్తి వంకాయ కూర మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కూర‌ను మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గుత్తి వంకాయ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గుత్తి వంకాయ‌లు – అర కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నాన‌బెట్టిన చింత‌పండు – 10 గ్రా., నీళ్లు – ఒక గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Guthi Vankaya Kura Recipe in telugu tastes better with rice
Guthi Vankaya Kura Recipe

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బ‌రి పొడి – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, పుదీనా – కొద్దిగా, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌.

గుత్తి వంకాయ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి తొడిమె తీయ‌కుండా నాలుగు భాగాలుగా చేసుకోవాలి. వీటిని ఉప్పు వేసిన నీటిలో ఉంచి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ప‌ల్లీలు వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత ధ‌నియాలు, జీడిప‌ప్పు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, జీల‌క‌ర్ర‌, ఎండుకొబ్బ‌రి, సాజీరా, నువ్వులు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. వీటిని చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అదే జార్ లో మిగిలిన ప‌దార్థాల‌ను వేసి గ‌ట్టి పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ మ‌సాలా పేస్ట్ ను ముందుగా త‌రిగిన వంకాయ‌ల‌ల్లోకి స్ట‌ఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వంకాయ‌ల‌ను స్ట‌ఫ్ చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి.

ఇవి వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న వంకాయ‌ల‌ను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వంకాయ‌ల‌ను మ‌రో వైపుకు తిప్పి మూత పెట్టి వాటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు పూర్తిగా వేయించాలి. త‌రువాత ఇందులో మిగిలిన మ‌సాలా మిశ్ర‌మాన్ని వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా పొడి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అంద‌రూ ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts