వినోదం

Sukumar Movies : డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని ఎప్పుడైనా గమనించారా..!

Sukumar Movies : ఒక్కొక్క డైరెక్టర్ కి తన సినిమా తీసే విధానంలో ఒక స్టైల్ ఉంటుంది. దర్శకుడు వారు చిత్రీకరించిన చిత్రాలలో ఏదో ఒక కామన్ పాయింట్ ని చూపించడం వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆయన చిత్రాల్లో హీరోయిన్స్ బొడ్డు పై పూలు, పండ్లు వేయటం కామన్ పాయింట్ గా చూపిస్తూ ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలలో లాకెట్ అనేది కామన్ పాయింట్ గా కనిపిస్తుంది.

రాజమౌళి యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నతనంలో లాకెట్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. యమదొంగలో చిన్న వయసులో హీరోయిన్ హీరో కు లాకెట్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ లాకెట్ ద్వారానే హీరోయిన్ హీరోను గుర్తించడం కనిపిస్తుంది. అదే విధంగా ఈగ సినిమాలో సమంత నానికి లాకెట్ చేసి ఇస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ లాకెట్ సీన్ కనిపిస్తోంది.

have you observed this in sukumar movies

అదేవిధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ ని అమాయకంగా, తింగరవారిగా చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఓ పాయింట్ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్లకు బ్లౌజ్‌పై పైట లేకుండా సన్నివేశాలు ఉంటాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయతోపాటు సమంతకు కూడా పైట లేకుండా ఉండే సన్నివేశాలలో కనిపించారు.

అదే విధంగా పుష్పలో కూడా అలాంటి సీన్లు కనిపిస్తున్నాయి. ఐటమ్ సాంగ్ లో సమంత పైట లేకుండా స్టెప్పులు వేస్తుంది. అదే విధంగా రష్మిక మందన్న కూడా కొన్ని సన్నివేశాలలో పైట లేకుండానే కనిపిస్తుంది. దర్శకుడు సుకుమార్ తీసే సినిమాను బట్టి తన స్టైల్ ను మార్చుకుంటూ ఉంటాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమాల్లోనే ఈ క్రేజీ దర్శకుడు పైట లేకుండా ఉండే సన్నివేశాలను హీరోయిన్స్ తో చిత్రీకరిస్తాడు. కానీ మిగతా సినిమాల్లో అలాంటి సీన్లు ఎక్కడ కనిపించవు.

Admin

Recent Posts