ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలని చెయ్యాలి..?

Lord Hanuman : చాలామంది ఆంజనేయస్వామిని పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చాలా మందిలో ఉండే సందేహం. మరి మీకు కూడా ఆ సందేహం ఉన్నట్లయితే, ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచిది అనేది ఇక్కడ ఉంది.

ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 108 ప్రదక్షిణలని ఆంజనేయ స్వామి ఆలయంలో చేస్తే, ఎలాంటి దోషాలు కూడా ఉండవని పండితులు చెప్తున్నారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు లెక్క మర్చిపోకుండా పువ్వులని కానీ వక్కలతో కానీ మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక 108 ప్రదక్షిణలు చేయలేనివారు, ఒక పక్షంలో కనీసం 54 ప్రదక్షిణలు అయినా చేయొచ్చు. ఒకవేళ వీలు కాకపోతే అందులో సగం, అంటే 27 ప్రదక్షిణలు చేస్తే చాలు.

how many pradakshinas to do if you go to lord hanuman temple

27 ప్రదక్షిణలు చేయడం కూడా నా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు, 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. 11 ప్రదక్షిణలు కూడా చేయలేని వారు ఐదు ప్రదక్షిణాలు చేసినా, మంచి ఫలితం కనబడుతుందని పండితులు అంటున్నారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి, ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే మంచిది. ”ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం! బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్ !!” అని 108 సార్లు చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి ముందుకు వచ్చి ఈ శ్లోకం చదువుకోండి ఇలా మీరు ఆచరించారంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుండి బయటపడొచ్చు. మరి ఇక ఈసారి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తు పెట్టుకుని ఆచరించండి. అప్పుడు ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. సమస్యల నుండి చక్కగా బయటపడవ‌చ్చు. సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts