ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజనేయ స్వామి బ్రహ్మచారి ఏనా..? ఆయన భార్య ఎవరు..? ఇంత పెద్ద కథ ఉందని చాలామందికి తెలీదు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా గొప్ప పని తలపెట్టి, సంకల్పబలంతో దాన్ని పూర్తి చేయాలంటే, ఆంజనేయస్వామి ఆదర్శంగా నిలుస్తారు. అంత గొప్ప ఆయన ఆంజనేయ స్వామి. ఆయన బ్రహ్మచారి అని కూడా అంటారు. మరి, ఆంజనేయస్వామి తో పాటు, సువర్చలాదేవిని పూజిస్తాము ఎందుకు..? ఈ విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుడి గురువు సూర్యుడు. సూర్యుడుతోపాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నీ కూడా నేర్చుకున్నాడు.

ఆపైన నవ్య వ్యాకరణలుగా పిలవబడే, 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కేవలం పాణిని వ్యాకరణం ఒక్కటే, ప్రచారంలో ఉన్నది. కానీ, ఒకప్పుడు ఇంద్రం, కౌమారకం ఇలా తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. పెళ్లయిన వాళ్ళకి మాత్రమే వీటిని నేర్చుకునే అర్హత ఉంది. హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి పోవాలని అనుకున్నారు. హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చాలని త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడు దగ్గరికి వెళ్లారు.

do you know that lord hanuman has also wife and her story

అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుండి, ఒక కుమార్తెని సృష్టించడం జరుగుతుంది. ఈమె వర్చస్సు తో ఏర్పడింది కనుక, ఆమెకి సువర్చలా అని పేరు పెట్టారు. ఈమెని నువ్వు తప్ప ఎవరు వివాహం చేసుకోలేరు అని చెప్తారు. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని సూర్యుడు, ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపించాలని చెప్పారు.

తర్వాత, నవ్య వ్యాకరణాలన్నీ నేర్పించారు. ఆమె వలన హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. సువర్చల సుత ఆంజనేయ ఆలయం ఖమ్మం జిల్లాలో ఉంది. అక్కడ నిత్యం ధూప దీప నైవేద్యాలని పెట్టి పూజిస్తారు. కేవలం, ఈ ఒక్క చోటే కాదు గుంటూరు జిల్లాలో కూడా సీతారామచంద్రస్వామి తో పాటు, శ్రీరామనవమి రోజు నాడు, సువర్చలా హనుమంతుడికి కళ్యాణం చేస్తారు.

Admin

Recent Posts