lifestyle

Perfume : శ‌రీరంపై పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Perfume : బయటకు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లకు హాజరైనప్పుడు సహజంగానే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను స్ప్రే చేసుకుంటుంటారు. దీంతో చెమట వాసన రాకుండా ఉంటుంది. అయితే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను బాడీపై ఇష్టం వచ్చినట్లు స్ప్రే చేస్తారు. ఈ క్రమంలో ఆ పర్‌ఫ్యూమ్ చాలా త్వరగా అయిపోతుంది. మళ్లీ చెమట వాసన మొదలవుతుంది. అయితే మన శరీరంపై పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు ఉండాలన్నా, బాటిల్‌లో ఉన్న పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ కాలం పాటు అలాగే నిలిచి ఉండాలన్నా.. అందుకు కింద తెలిపిన టిప్స్ పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పెర్‌ఫ్యూమ్‌లు ఉష్ణోగ్రతలకు ప్రభావితం అవుతాయి. అందుకని వాటికి సూర్యరశ్మి తగలకుండా ఉంచాలి. వేడిగా ఉండే ఉష్ణోగ్రతలో కాకుండా పెర్‌ఫ్యూమ్‌లను చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అలాగే వాటిపై ఇతర కాంతి కూడా పడకుండా చీకటి ప్రదేశంలో ఉంచాలి. దీంతో బాటిల్స్‌లో ఉండే పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంటుంది.

how to keep perfume longer times on body

ఇక శరీరంపై స్ప్రే చేసుకునే పెర్‌ఫ్యూం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండి వాసన రావాలంటే.. ముందుగా మన శరీరాన్ని పూర్తిగా తేమ లేకుండా డ్రైగా ఉండేట్లు చేసుకోవాలి. ఆ తరువాత శరీరంలో చెమట ఎక్కువ వచ్చే ప్రదేశాలను గుర్తించాలి. సాధారణంగా చంకలు, మెడ, మోచేయి లోపలి వైపు, మణికట్టు ప్రాంతాల్లో చాలా మందికి చెమట వస్తుంటుంది. ఆ ప్రాంతాల్లో పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకోవాలి. శరీరానికి కొంత దూరం ఉంచి పెర్‌ఫ్యూంను స్ప్రే చేయాలి. దీంతో వాసన ఎక్కువ సేపు ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే శరీరంపై పెర్‌ఫ్యూం ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

Admin

Recent Posts