vastu

సొంత ఇల్లుని కట్టుకుంటున్నారా..? అయితే ఈ తప్పులని అస్సలు చేయకండి..!

సొంత ఇల్లు కట్టుకోవాలంటే అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ, అందరికీ అది సాధ్యం అవ్వదు. సొంత ఇల్లు గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. అయితే, ఇంటి నిర్మాణం విషయంలో, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. మరి ఎటువంటి తప్పులు ఇంటి నిర్మాణ సమయంలో చేయకూడదు అనేది తెలుసుకుందాం. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు, చిన్న చిన్న విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. అలా చేయడం వలన ఊహించుకున్న సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడం కుదరదు.

కొత్తగా ఇల్లు నిర్మించే ముందు, వాస్తు నిపుణులని అడిగి, ఏది ఏ దిశలో ఉండాలనేది చూసుకోండి. అలానే, ఇంజనీర్ యొక్క సలహాలని కూడా తీసుకోండి. ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత, వెనక్కి తిరిగి చూడకుండా జాగ్రత్తగా ఇల్లుని నిర్మించుకోవాలి. ఇంటి చుట్టూ కట్టే కాంపౌండ్ వాల్ కి తగిలేలా ఎలాంటి కట్టడాలు చేయకూడదు. మెట్లని ప్రహరీ గోడకి తగిలేలా కట్టుకోకూడదు. కొంత మంది మెట్ల కింద పని వారికి చిన్న గది కట్టడం లేదంటే జంతువుల‌ కోసం చిన్న గది కట్టడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మెట్ల కింద గది రాకూడదు.

if you are building your own house then do not make any mistakes

అలానే, ఇంటి ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టుకోకూడదు. ఇంటి నుండి వెళ్లే నీళ్లు తూర్పు లేదా ఉత్తరం వైపు బయటకు వెళ్లడం మంచిది. పడమర, దక్షిణం వైపు నుండి వెళ్ళకూడదు. ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు ద్వారం పై గోమాత సమేత భోజపుత్ర యంత్ర సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదుకల పటం ఉంటే, ఎంతో మంచి జరుగుతుంది.

ఈశాన్యం వైపు భార్యాభర్తల బెడ్ రూమ్ ఉండకూడదు. ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు, అటువైపు ఆవులు, దూడలు వంటివి వచ్చినట్లయితే, వాటికి తాగడానికి నీళ్లు, గ్రాసం వంటివి పెట్టాలి. హిందూ పంచాంగం ప్రకారం జేష్ఠ, చైత్రం, ఆషాడం, భాద్రపద, ఆశ్వీయుజ, మార్గశిర, పుష్య మాసాలలో ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టకూడదు.

Admin

Recent Posts