lifestyle

Bangles : స్త్రీలు త‌ప్ప‌నిస‌రిగా గాజుల‌ను ధ‌రించాల్సిందే.. ఇది తెలిస్తే వెంట‌నే ఆ ప‌నిచేస్తారు..!

Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన దిష్టి తగలదు. దోషాలు రావు. పైగా ఆ గాజుల శబ్దం ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. చేతికి నిండుగా గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే మహిళలు ఇంటి వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా చూసుకోగలుగుతారని అంటారు. రంగురంగుల గాజులు వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

women must wear bangles know the reason

పైగా ఆ రంగుల‌కి కూడా అర్థాలు ఉన్నాయి. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విజ్ఞానాన్ని సూచిస్తాయి. ఆకుపచ్చ అదృష్టాన్ని, పసుపు రంగు సంతోషాన్ని, ఊదా రంగు స్వేచ్ఛని.. సూచిస్తాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు సౌభాగ్యానికి చిహ్నం. బంగారం గాజులు ఎన్ని వేసుకున్నా, చేతికి ఒకటి రెండు మట్టి గాజులు వేసుకోవాలని అంటారు. అమ్మవారిని పూజించేటప్పుడు, పసుపు కుంకుమతోపాటు గాజులని కూడా పెట్టి పూజిస్తారు.

మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని సూచిస్తుంది. గాజులు పగిలిపోవడం మంచిది కాదని.. అమంగళం, అశుభమని అంటారు. ఇలా గాజులకి ఇంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా కచ్చితంగా గాజులని ధరించాలి. గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. క‌నుక కచ్చితంగా పెళ్లయిన మహిళలు గాజులని వేసుకుని తీరాలి.

Admin

Recent Posts