lifestyle

Watch : వాచ్‌ల‌ను ధ‌రిస్తే.. బంగారు రంగులో ఉండే వాచ్‌ల‌నే ధ‌రించాలి.. ఎందుకో తెలుసా..?

Watch : వాచ్‌ల‌ను ధ‌రించ‌డం కొంత మందికి స‌ర‌దా. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న త‌ర‌హా వాచ్‌ల‌ను కొనుగోలు చేస్తూ ధ‌రిస్తుంటారు. ఇక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చాక అనేక రకాల వాచ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం వాచ్‌ల‌ను ధ‌రించే విష‌యంలోనూ ప‌లు నియమాలు ఉంటాయి. అవేమిటంటే..

1. చేతికి ఎప్పుడూ బంగారం లేదా వెండి రంగులో ఉండే వాచ్‌ల‌నే ధ‌రించాల‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వ‌ల్ల ఉద్యోగం, వ్యాపారంలో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటారు.

2. వాచ్ డ‌య‌ల్ మ‌రీ పెద్ద‌గా ఉండ‌రాదు. అలాగ‌ని మ‌రీ చిన్న డ‌య‌ల్ ఉండ‌రాదు. స‌మ‌యం క‌చ్చితంగా క‌నిపించే వాచ్‌ను ఎంచుకుని ధ‌రించాలి. దీంతో పాజిటివ్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డి ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.

if you wear watch make sure it is in golden color

3. వాచ్‌ల‌ను కొంద‌రు దిండు కింద పెట్టి నిద్రిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇలా చేయ‌రాదు. దీని వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. అది స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. వాచ్‌ను ధ‌రించి తీసేశాక దాన్ని బీరువాలో ఉంచితే మంచిది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. అదృష్టం వెంట ఉంటుంది.

4. కుడి చేతి వాటం ఉన్న‌వారు ఎడ‌మ చేతికి, ఎడ‌మ చేతి వాటం ఉన్న‌వారు కుడిచేతికి వాచ్‌ను ధ‌రిస్తే మంచిది. దీంతో సౌక‌ర్య‌వంతంగా ఉండ‌డ‌మే కాదు, వాస్తు ప‌రంగా క‌ల‌సి వ‌స్తుంది.

5. పూర్తిగా గుండ్రంగా లేదా పూర్తిగా చ‌ద‌రంగా ఉన్న వాచ్‌ల‌నే ధ‌రించాలి. ఇత‌ర ఆకారాల్లో ఉండే వాచ్‌ల‌ను ధరించరాదు. మ‌రీ పెద్ద‌గా ఉండే వాచ్‌ల‌ను కూడా ధ‌రించ‌రాదు.

6. వాచ్‌ను ఎల్ల‌ప్పుడూ చేతి మ‌ణిక‌ట్టు మీదే ధ‌రించాలి. అలాగే వాచ్ జారిపోకుండా ఉండేలా ధరించాలి. ఈ విధంగా వాచ్‌ను ధ‌రిస్తే వాస్తు ప్ర‌కారం ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts