వినోదం

Ramanaidu : ఈ రాళ్ల‌ల్లో ఏం స్టూడియో క‌డ‌తావ‌న్న ఎన్‌టీఆర్‌.. కానీ రామానాయుడు చేసి చూపించారు..

Ramanaidu : చెన్నైలో ఉన్న సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కి రావ‌డం వెన‌క అల‌నాటి ప్ర‌ముఖుల త్యాగం ఎంతో ఉంది. హైద‌రాబాద్‌కి పరిశ్ర‌మ వ‌చ్చాక కృష్ణ‌, రామానాయుడు, ఏఎన్ ఆర్ వంటి వారు ఎన్నో వ్య‌య‌ప్ర‌యాసలు చేకూర్చి స్టూడియో నిర్మించారు. అయితే ద‌గ్గుబాటి రామానాయుడు స్టూడియో నిర్మాణం వెన‌క చిన్న‌పాటి యుద్ధ‌మే చేశారు. మ‌ద్రాసు నుండి చిత్ర‌ప‌రిశ్ర‌మ షిఫ్ట్ అయితన‌ స‌మ‌యంలో సీఎంగా జ‌ల‌గం వెంక‌ట‌రావు ఉన్నారు. ఆయ‌న అక్క‌నేని కి బంజారా హిల్స్ లో స్థ‌లం కేటాయించారు. ఇక నిర్మాత డి రామానాయుడిని కూడా స్థలం కావాలా అని అడిగార‌ట‌. కానీ రామానాయుడు వ‌ద్ద‌న్నార‌ట‌. దానికి కార‌ణం ఆయ‌న విజ‌య‌ప్రొడ‌క్ష‌న్స్ లో సినిమాలు చేస్తూ వారి స్టూడియోనే త‌న స్టూడియో అనుకున్నార‌ట‌.

నిర్మాత నాగిరెడ్డి ఓ స‌మ‌యంలో కొండ‌లో స్టూడియో క‌డితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌.దాంతో రామానాయుడికి అక్క‌డ స్టూడియో క‌ట్టాల‌నే ఆలోచ‌న మొద‌ల‌య్యింది. ఆ త‌ర‌వాత భ‌వ‌నం వెంక‌ట్ రామ్ రెడ్డి సీఎంగా ఉన్ప‌ప్పుడు రామానాయుడికి స్టూడియో కోసం స్థ‌లాన్ని కేటాయించారు. అయితే ఈ ప్లేస్ చూసిన ఎన్టీరామారావు ఈ రాళ్ల‌ల్లో ఏం స్టూడియో క‌డ‌తావు అంటూ ప్ర‌శ్నించారట‌. ఇక్క‌డి నుండిచూస్తే వ్యూ బాగుంటుంద‌ని రామానాయుడు చెప్ప‌గా, దానికి ఎన్టీఆర్ వ్యాపారం చేసుకుంటావా.? వ్యూ చూస్తూ కూర్చుంటావా. ఇక్క‌డ ఎవ‌రు సినిమాలు తీస్తార‌ని స‌ర‌దాగా అన్నార‌ట‌.

interesting facts about rama naidu studio

కాని ఆయ‌న దీక్ష‌గా ప‌నులు మొద‌లు పెట్టారు. రాళ్ల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది ఆ స‌మ‌యంలో నిరాశ‌లోకి వెళ్లిపోయారు రామానాయుడు. అదే స‌మ‌యంలో సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వ‌డం వెంక‌టేష్ కూడా సినిమాలు చేస్తూ డ‌బ్బులు సంపాదించ‌డంతో వారి ఆదాయం అంతా స్టూడియో మీద‌నే ఖ‌ర్చు చేశారు. కానీ చివ‌రికి అన్ని సౌక‌ర్య‌ల‌తో స్టూడియోను నిర్మించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రామానాయుడు స్టూడియోస్‌.. హైదరాబాద్‌లో ఈ పేరుతో రెండు ఉన్నాయి, విశాఖపట్నంలో ఒకటి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్న రెండింటిలో ఒకదాంట్లోనే సీరియస్‌గా సినిమా వర్క్లు జరుగుతున్నాయి.

Admin

Recent Posts