IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో క‌ఠిన‌మైన రూల్స్‌.. ప్లేయ‌ర్ల‌కు అంత ఈజీ కాదు..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్స్ ఇప్ప‌టికే త‌మ త‌మ శిబిరాల‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాయి. ఇక గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టోర్నీలో బీసీసీఐ అత్యంత క‌ఠిన‌మైన రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. దీంతో ప్లేయ‌ర్లు అంత ఈజీగా ఏమీ త‌ప్పించుకోలేరు.

IPL 2022 rules are very strict announced by BCCI
IPL 2022

గ‌త సీజ‌న్‌లో బ‌యో సెక్యూర్ బ‌బుల్‌లో ఉన్న లోపాల కార‌ణంగా లీగ్‌ను రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. దీంతో చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ సారి అలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు బీసీసీఐ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోనుంది. బ‌యో బ‌బుల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనుంది. అలాంటి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌లు చేసింది. దీంతో ప్లేయ‌ర్లు ఈసారి అంత సుల‌భంగా రూల్స్‌ను అతిక్ర‌మించ‌లేరు.

ఇక ఎవ‌రైనా ప్లేయ‌ర్ బ‌యో బ‌బుల్ దాటి బ‌య‌టకు వెళ్లి వ‌స్తే.. క‌చ్చితంగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అలాగే రెండోసారి రూల్‌ను ఉల్లంఘిస్తే ఒక మ్యాచ్‌లో ఆడ‌కుండా నిషేధం విధిస్తారు. అదే మూడోసారి కూడా రూల్‌ను ఉల్లంఘించి బ‌య‌ట‌కు వెళితే.. ఏకంగా టోర్నీ నుంచే గెంటివేస్తారు. ఇలా బ‌యో బ‌బుల్ విష‌యంలో బీసీసీఐ క‌చ్చిత‌మైన నియ‌మాల‌ను పాటించాల‌ని ఇప్ప‌టికే ప్లేయ‌ర్ల‌కు, ఫ్రాంచైజీల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇక మూడోసారి కూడా బ‌యోబ‌బుల్ నిబంధ‌న‌ను ఉల్లంఘించి ఎవ‌రైనా ప్లేయ‌ర్ టోర్నీ నుంచి నిషేధానికి గురైతే.. ఇంకో ప్లేయ‌ర్‌ను టీమ్ పెట్టుకుంటానికి కూడా లేదు. క‌నుక క‌చ్చితంగా ప్లేయ‌ర్లు నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

కాగా బ‌యోబ‌బుల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే కేవ‌లం ప్లేయ‌ర్ల‌కే కాదు.. జ‌ట్ల‌కు కూడా క‌ఠిన శిక్ష‌లు ఉంటాయి. తొలి ఉల్లంఘ‌న‌కు టీమ్‌కు రూ.1 కోటి జ‌రిమానా విధిస్తారు. రెండోసారి అయితే 1 పాయింట్ లో కోత ఉంటుంది. మూడో సారి అయితే 2 పాయింట్ల కోత ఉంటుంది. క‌నుక ఒక ప్లేయ‌ర్ త‌ప్పు చేస్తే.. జ‌ట్టు మొత్తం శిక్ష‌ను అనుభవించాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అందుక‌నే ఈసారి నియ‌మాలు చాలా క‌ఠినంగా మార‌నున్నాయి. అయితే ఈసారైన ఈ లీగ్ ఎలాంటి ఆటంకం లేకుండా జ‌రుగుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Editor

Recent Posts