IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఆయా జట్లకు చెందిన ప్లేయర్లు టీమ్‌లతో కలిసి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశారు. కాగా గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతోంది. అందులో భాగంగానే ఆ జట్టు ప్లేయర్లు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నారు.
ఇక ఐపీఎల్ ప్రాక్టీస్‌లో భాగంగా హైదరాబాద్ జట్టు రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. చెపాక్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌ను ఆడగా.. ప్లేయర్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇక జట్టు స్టార్ బౌలర్ నటరాజన్ బౌలింగ్‌లో కెప్టెన్స్ కేన్ విలియమ్సన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ గత కొంత కాలంగా అతను గాయం కారణంగా క్రికెట్ ఆడలేదు. దీంతో అతను ఐపీఎల్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడోనని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. కాగా హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను మార్చి 29వ తేదీన ఆడనుంది. అందులో రాజస్థాన్ జట్టును హైదరాబాద్ జట్టు ఢీకొట్టనుంది.