Jio Rs 479 Prepaid Plan : జియో నుంచి అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

Jio Rs 479 Prepaid Plan : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఈ మ‌ధ్యే మొబైల్ చార్జిల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో చిర్రెత్తుకొచ్చిన క‌స్ట‌మ‌ర్లు చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు గాను జియో చ‌వ‌కైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వారిని ఆక‌ర్షిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగంలో ఇదే అత్యంత చ‌వ‌కైన ప్లాన్ కావ‌డం విశేషం. ఇందులో వినియోగ‌దారుల‌కు ప‌లు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ఆ ప్లాన్‌, దాని వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టెలికాం సంస్థ జియో రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచింది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలంటే క‌స్ట‌మ‌ర్లు మై జియో యాప్ లేదా జియో వెబ్ సైట్ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్‌ల‌లో అందుబాటులో లేదు. ఇక ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ను కూడా అన్‌లిమిటెడ్‌గానే చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.

Jio Rs 479 Prepaid Plan full details and benefits you will get
Jio Rs 479 Prepaid Plan

ఉచితంగా జియో యాప్స్‌..

ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు మొత్తంగా 6జీబీ డేటా ఉచితంగా వ‌స్తుంది. ఈ ప్లాన్‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు ల‌భిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అయితే జియో సినిమా ప్రీమియం మెంబ‌ర్‌షిప్ కావాలంటే మాత్రం స‌భ్య‌త్వ రుసుము క‌ట్టాల్సి ఉంటుంది. ఇక త్వ‌ర‌లో జియో.. జియో ట్రాన్స్‌లేట్‌, జియో సేఫ్ అనే యాప్స్‌ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ యాప్స్‌ను కూడా క‌స్ట‌మ‌ర్లు ఉచితంగానే ఉప‌యోగించుకోవ‌చ్చు.

అయితే రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేటా ఎక్కువ‌గా ల‌భించ‌దు. కానీ కేవ‌లం వాయిస్ కాల్స్ మాత్ర‌మే ఎక్కువ‌గా వాడుకుంటాం.. అనుకునే వారికి ఈ ప్లాన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ విభాగంలో ఇదే అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌గా ఉంది. అలాగే జియోలో రూ.799 ప్లాన్ ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 84 రోజులుగా ఉంది. ఇందులోనూ ముందు చెప్పిన జియో యాప్స్‌ను క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఇక రూ.666 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు 70 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఈ ప్లాన్లు రెండింటిలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు.

Editor

Recent Posts