Kodiguddu Karam : ఈ పొడి వేసి కోడిగుడ్డు కారం చేస్తే.. అన్నం మొత్తం తినేస్తారు..!

Kodiguddu Karam : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోషకాలు కూడా అందుతాయి. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. ఈ విధంగా కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌నుక‌ అందులో భాగంగా కోడిగుడ్ల‌తో రుచిగా, సుల‌భంగా కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 4, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఉడికించిన కోడిగుడ్లు – 6, క‌రివేపాకు ఒక రెమ్మ‌, కారం – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్.

Kodiguddu Karam recipe make with this powder very tasty
Kodiguddu Karam

కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండుమిర్చి – 12 నుండి 15, నువ్వులు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి పాయ – 1, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, పుట్నాల ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు -త‌గినంత‌.

కోడిగుడ్డు కారం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో కారం పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కారం, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి.త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను వేసి 2 నిమిషాల‌పాటు బాగా వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత క‌రివేపాకు, వేయించిన కోడిగుడ్లు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో నిమిషం పాటు వేయించిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్డుతో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కారాన్ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts