Mahesh Babu : ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన డైరెక్టర్‌గా సినిమా తీశారంటే హిట్ గ్యారంటీ.. అంతలా ఈయన పేరుగాంచారు. అందుకనే ఈయన డైరెక్షన్‌లో సినిమాలు చేసేందుకు హీరోలు, హీరోయిన్లు పోటీపడుతుంటారు. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి తీసిన ఒక సినిమా విడుదలయ్యాకనే ఇంకో సినిమా చేస్తుంటారు. ఈ క్రమంలోనే త్వరలో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇది వరకే ప్రకటించారు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నారు. అందులో మహేష్ పక్కన పూజా హెగ్డె నటిస్తోంది. ఈ మూవీ అయ్యాక మహేష్.. రాజమౌళితో సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ తెలుస్తోంది.
మహేష్‌బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాలో బాలకృష్ణను ఇంకో కీలక రోల్‌లో నటింపజేయనున్నారట. ఇందుకు గాను బాలకృష్ణను రాజమౌళి టీమ్ సంప్రదించిందట. అయితే బాలకృష్ణ ఓకే చెబితే ఆయన రాజమౌళితో చేయబోయే సినిమా మళ్లీ మల్టీ స్టారర్ అవుతుంది. దీంతో మహేష్, బాలకృష్ణలను ఒకే తెరపై చూడవచ్చన్నమాట. నిజంగా ఇది అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పవచ్చు. దీంతో సినిమాకు భారీగా హైప్ వస్తుంది.
అయితే మహేష్ బాబుతో చేస్తే సోలోగా ఆయనను ఒక్కడినే హీరోగా పెట్టి సినిమా తీయండి.. కానీ అందుబాలో బాలకృష్ణను పెట్టకండి.. మహేష్‌తో సినిమాకు ఎలాగూ 2-3 ఏళ్లు పడుతుంది. అన్ని రోజుల పాటు వేచి చూసి కూడా చివరకు మల్టీ స్టారర్ చూడాల్సి వస్తుంది. దీంతో మహేష్ కు పెద్దగా పేరు రాదు.. అందువల్ల మహేష్ ఒక్కడినే హీరోగా పెట్టి సినిమా తీయండి.. లేదంటే లేదు.. అని మహేష్ ఫ్యాన్స్ రాజమౌళిని వేడుకుంటున్నారు. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.