Samantha : సమంత.. ఈ పేరు ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఆమె నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాక ఆమె విడాకులు ఇస్తున్నందుకు ఆమెపై దుమ్మెత్తి పోశారు. అనేక విమర్శలు చేస్తూ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఆమె విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఆమె చాలా హద్దులు మీరుతుందని.. అంతలా ఓవర్ గ్లామర్ షో చేయడం ఎందుకని.. చాలా మంది ఆమెను తప్పుబడుతున్నారు. అయితే ఆమెకు ఉండాల్సిన రీజన్స్ ఆమెకు ఉంటాయి. కానీ ఇప్పులా చేయక తప్పని పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. అవును.. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశంలో పోటీ నెలకొంటోంది. మరలాంటప్పుడు సినిమా రంగంలోనూ ఉంటుంది కదా. కనుక ఆ పోటీని తట్టుకోవాలంటే.. ఆమాత్రం అందాల ప్రదర్శన చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
గతంలో అంటే వేరే. హీరోయిన్ల నటన, వాక్చాతుర్యం, హావ భావాలు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్లు గ్లామర్ షో చేస్తేనే కొందరు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే అలా అని చెప్పి గ్లామర్ షో చేయని సినిమాలు హిట్ కావడం లేదు.. అని కాదు. కానీ హీరోయిన్ల మధ్య మాత్రం ఆ విషయంలో పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఫలానా హీరోయిన్ ఎలాంటి గ్లామర్ షోకు అయినా రెడీ.. అని తెలిస్తే.. అప్పుడు ఆమెకు దర్శక నిర్మాతల నుంచి పిలుపు వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. కనుకనే హీరోయిన్స్ మధ్య పోటీ నెలకొంది.
ఇక సమంత విషయానికి వస్తే.. ఆమె టర్మ్ అయిపోయే కాలం వచ్చింది. మహా అయితే ఇంకో 2 లేదా 3 ఏళ్లకు మించి సినిమాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నారు. కనుక సమంతకు ఆమె ప్లేస్ ఆమెకు ఉంటుందని చెప్పలేం. కనుక దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలన్న చందంగా ఆమె ఇలా గ్లామర్ షోకు తెరలేపిందని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అణగి మణిగి ఒద్దికగా ఉంటే ఏ హీరోయిన్‌కు అవకాశాలు రావు. ఆ విషయం అందరికీ తెలుసు. పైగా సమంత ఇప్పుడు ఒంటరి. సినిమాలు లేకున్నా భర్త తోడు ఉన్నాడని అనుకుంటానికి లేదు. అక్కినేని ఫ్యామిలీ అండ కూడా లేదు. కనుక ఇప్పుడు ఆమె దారి ఆమె చూసుకోవాల్సిందే. కనుక తప్పని పరిస్థితిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకే ఆమె ఇలా ఓవర్ గా గ్లామర్ షో చేస్తుందని తెలుస్తోంది.
అయితే ఆమె గ్లామర్ షో వెనుక రీజన్స్ ఏమి ఉన్నా.. ఆమెపై రోజు రోజుకీ నెగెటివిటీ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. మరి ముందు ముందు ఆమెపై విమర్శలు తగ్గుతాయా.. లేక అలాగే కంటిన్యూ అవుతాయా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.