Saggubiyyam Dosa : స‌గ్గు బియ్యంతో దోశ‌.. ఇలా చేశారంటే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..

Saggubiyyam Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దోశ‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప ప‌ప్పును, బియ్యాన్ని వాడుతూ ఉంటాం. వీటితోనే కాకుండా స‌గ్గుబియ్యం అలాగే ర‌వ్వ‌ను ఉప‌యోగించి కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

స‌గ్గు బియ్యాన్ని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న శ‌రీరానికి మేలు చేసే స‌గ్గుబియ్యంతో దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స‌గ్గుబియ్యం ర‌వ్వ‌ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌గ్గుబియ్యం – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, నీళ్లు – ఒక‌ క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 4, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన క‌రివేపాకు – కొద్దిగా.

make Saggubiyyam Dosa in this way very tasty
Saggubiyyam Dosa

స‌గ్గు బియ్యం ర‌వ్వ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో స‌గ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మ‌రో గిన్నెలో ర‌వ్వ‌ను, పెరుగును, పావు క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లపాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత నాన‌బెట్టిన స‌గ్గుబియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకుని అందులోనే పావు క‌ప్పు నీళ్ల‌ను పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నాన‌బెట్టుకున్న ర‌వ్వ మిశ్ర‌మంతో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి.

త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడ‌య్యాక మంట‌ను మధ్య‌స్థంగా ఉంచి పెనం మీద నూనెను వేయాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి. త‌రువాత ఈ దోశ‌ను నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే స‌గ్గుబియ్యం ర‌వ్వ దోశ‌లు త‌యార‌వుతాయి.

వీటిని ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ చేసుకునే దోశ‌ల‌కు బ‌దులుగా ఇలా స‌గ్గుబియ్యంతో కూడా రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఇలా స‌గ్గుబియ్యంతో చేసిన దోశ‌ల‌ను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts